దేవుని వాక్యంలో ఉన్న సంపద
అహంకారం అవమానానికి నడిపిస్తుంది
రాజైన సౌలు తాను ఒక పెద్ద సమస్యలో ఉన్నట్లు భావించాడు (1స 13:5-7)
వినయంతో యెహోవా నిర్దేశాల్ని పాటించే బదులు సౌలు అహంకారంగా ప్రవర్తించాడు (1స 13:8, 9; w00 8/1 13వ పేజీ, 17వ పేరా)
యెహోవా సౌలును శిక్షించాడు (1స 13:13, 14; w07 6/15 27వ పేజీ, 8వ పేరా)
ఒక వ్యక్తి ఏం చేస్తే అహంకారంతో ప్రవర్తించినట్టు అవుతుంది? తనకు అధికారంలేని పనిని తొందరపాటుతో చేసినప్పుడు అతను అహంకారం చూపించినట్టు అవుతుంది. వినయం లేనివాళ్లు అహంకారంగా ప్రవర్తిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో ఒకవ్యక్తి అహంకారంగా ప్రవర్తించే అవకాశం ఉంది?