దేవుని వాక్యంలో ఉన్న సంపద | నిర్గమకాండం 37-38
ధూపవేదిక, బలిపీఠం—సత్యారాధనలో వాటికున్న పాత్ర
ధూపవేదిక, బలిపీఠం యెహోవా నిర్దేశాల ప్రకారం కట్టబడ్డాయి, వాటికి ఎంతో ప్రత్యేకత ఉంది.
నేర్పుగా కలిపి అర్పించిన ధూపద్రవ్యం యెహోవాను సంతోషపెట్టినట్టే, తన సేవకులు సరైన విధంగా చేసే ప్రార్థనలు కూడా ఆయనను సంతోషపెడతాయి
బలిపీఠం మీద అర్పించే బలుల్ని యెహోవా అంగీకరించేవాడు. అయితే ఆ బలిపీఠం పవిత్రమైన స్థలం ఎదురుగా ఉండేది. అది మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది, యేసు విమోచన క్రయధన బలిపై విశ్వాసం కలిగి ఉంటేనే యెహోవా మనల్ని అంగీకరిస్తాడు.—యోహా 3:16-18; హెబ్రీ 10:5-10
మన ప్రార్థనలు దేవుని ముందు ధూపంలా ఉండాలంటే ఏం చేయవచ్చు?—కీర్త 141:2