మన క్రైస్తవ జీవితం
దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి నవంబరులో జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం
యేసు “దేవుని రాజ్యం గురించిన మంచివార్తను” ప్రకటించాడు. (లూకా 4:43) ఆయన ఆ రాజ్యం కోసం ప్రార్థించమని కూడా ప్రజలకు నేర్పించాడు. (మత్త 6:9, 10) నవంబరు నెలలో, దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి ఎక్కువగా కృషి చేస్తాం. (మత్త 24:14) ఈ ప్రచార కార్యక్రమంలో పూర్తిగా భాగం వహించడానికి మీ పనుల్ని సర్దుబాటు చేసుకోండి. ఈ నెలలో సహాయ పయినీరు సేవ చేయాలనుకుంటున్న వాళ్లు 30 లేదా 50 గంటలు చేయవచ్చు.
దేవుని రాజ్యం గురించి తెలియజేసే ఏదైనా ఒక లేఖనాన్ని మీ ప్రాంతంలో వీలైనంత ఎక్కువ మందికి చూపించండి. వినేవాళ్ల మత నమ్మకాలను మనసులో పెట్టుకుని లేఖనాన్ని ఎంపిక చేసుకోండి. ఎవరైనా మొదటిసారి కలిసినప్పుడు ఆసక్తి చూపిస్తే వాళ్లకు 2020 కావలికోట నం. 2 సార్వజనిక ప్రతిని ఇవ్వండి. ఆలస్యం చేయకుండా వెంటనే మళ్లీ వాళ్లతో మాట్లాడి, బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణను ఉపయోగించి బైబిలు స్టడీ మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. దేవుని రాజ్యం, దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలన్నిటినీ నలగ్గొట్టే సమయం చాలా దగ్గర్లో ఉంది. (దాని 2:44; 1కొ 15:24, 25) కాబట్టి యెహోవాకు, ఆయన రాజ్యానికి మనం విశ్వసనీయంగా ఉన్నామని చూపించడానికి, ఈ ప్రత్యేక అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుందాం!
దేవుని రాజ్యం ఈ భూమిని పరదైసుగా మారుస్తుంది!