మన క్రైస్తవ జీవితం
పయినీరు సేవ ద్వారా యెహోవాను స్తుతించండి
యెహోవాను స్తుతించడానికి ఇశ్రాయేలీయులకు చాలా కారణాలు ఉన్నాయి. ఆయన వాళ్లను ఐగుప్తు నుండి విడిపించాడు, ఫరో సైన్యం నుండి కాపాడాడు! (నిర్గ 15:1, 2) యెహోవా తన ప్రజలకు మంచి చేస్తూనే ఉన్నాడు. మరి ఆయనకు మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?—కీర్త 116:12.
ఒక మార్గమేమిటంటే, సహాయ లేదా క్రమ పయినీరుగా సేవ చేయడం. పయినీరు సేవ చేయాలనే కోరికను, అలా సేవ చేసే శక్తిని ఇవ్వమని యెహోవాను అడగండి. (ఫిలి 2:13) చాలామంది ముందుగా, సహాయ పయినీరుగా సేవ చేస్తారు. మీరు మార్చి, ఏప్రిల్ నెలల్లో అలాగే ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం జరిగే నెలలో 30 లేదా 50 గంటలు చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సహాయ పయినీరు సేవలోని ఆనందాన్ని రుచి చూశాక, క్రమ పయినీరు అవ్వడానికి కృషి చేయాలని మీకు అనిపించవచ్చు. కొంతమంది పూర్తికాల ఉద్యోగం చేస్తున్నా లేదా ఆరోగ్యం సహకరించకపోయినా క్రమ పయినీర్లుగా సేవ చేయగలుగుతున్నారు. (mwb16.07 8) యెహోవాను స్తుతించడానికి మనం చేసే ఏ కృషికైనా ఆయన అర్హుడని ఖచ్చితంగా చెప్పవచ్చు.—1ది 16:25.
మంగోలియాలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
పయినీర్లుగా సేవ చేయడానికి ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎలాంటి సవాళ్లను అధిగమించారు?
వాళ్లు ఎలాంటి దీవెనలు పొందారు?
క్రమ పయినీర్లుగా సేవ చేసినందుకు, యెహోవా సేవలో వాళ్లకు ఎలాంటి కొత్త అవకాశాలు వచ్చాయి?
వాళ్ల ఆదర్శం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపించింది?