దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 21-22
“యెహోవా ఇష్టమే జరగాలి”
పవిత్రశక్తే తనను యెరూషలేముకు నడిపిస్తోందని పౌలుకు అనిపించింది, అక్కడ పౌలుకు ప్రమాదం ఎదురవ్వబోతుంది. (అపొ 20:22, 23) కాబట్టి, అతని మంచి కోరే క్రైస్తవులు అక్కడికి వెళ్లొద్దని అతన్ని వేడుకున్నారు. అప్పుడు పౌలు ఇలా అన్నాడు: “మీరెందుకు ఇలా ఏడుస్తూ నా గుండెను బలహీనం చేస్తున్నారు?” (అపొ 21:13) యెహోవా సేవ కోసం త్యాగాలు చేస్తూ ముందుకు వెళ్లాలనుకుంటున్న వాళ్లను మనం ఎప్పుడూ నిరుత్సాహపర్చకూడదు.