కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 నవంబరు పేజీ 8
  • వేర్వేరు భాషలు ఉన్న క్షేత్రంలో కలిసి పనిచేయడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వేర్వేరు భాషలు ఉన్న క్షేత్రంలో కలిసి పనిచేయడం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • గృహస్థులు మరో భాష మాట్లాడేవారైతే ఏమి చేయాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • మంచివార్త ప్రకటించే పద్ధతులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—వేరే భాష మాట్లాడేవాళ్లకు సాక్ష్యమివ్వండి
    మన రాజ్య పరిచర్య—2015
  • అందరికీ ప్రకటించేలా క్రమపద్ధతిలో నడిపించబడుతున్నాం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 నవంబరు పేజీ 8

మన క్రైస్తవ జీవితం

వేర్వేరు భాషలు ఉన్న క్షేత్రంలో కలిసి పనిచేయడం

ఒక జంట పరిచర్యలో వేరే భాష మాట్లాడే ఒకతనిని అతని కొడుకును కలిశారు

ప్రజలు రాజ్యవార్తను తమ సొంత భాషలో విన్నప్పుడు వెంటనే స్పందిస్తారు. అందుకే క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున అక్కడున్న యూదులు సాధారణంగా హీబ్రూ లేదా గ్రీకు భాష మాట్లాడేవారైనా, “భూమ్మీదున్న అన్ని దేశాల నుండి వచ్చిన దైవభక్తిగల యూదులు” వాళ్ల “మాతృభాషల్లో” మంచివార్త వినేలా యెహోవా ఏర్పాటు చేశాడు. (అపొ 2:5, 8) ఈ రోజుల్లో ఒకే ప్రాంతంలో వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నప్పుడు ఆ భాషల్లో మీటింగ్‌ జరిగే సంఘాల క్షేత్రం పక్కపక్కనే ఉండవచ్చు. అలాంటి సంఘాల్లో ఉన్న ప్రచారకులు, ఒకే ఇంటికి మళ్లీమళ్లీ వెళ్లి ఇంటివాళ్లకు విసుగు తెప్పించకుండా అందరికి సాక్ష్యం ఇచ్చేలా ఎలా కలిసి పని చేయవచ్చు?

  • ఒక మొబైల్‌ ఫోన్‌

    సంప్రదించండి (సామె 15:22): సేవా పర్యవేక్షకులు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మంచివార్తను వ్యాప్తి చేయడానికి ఏ పద్ధతి మంచిదో నిర్ణయించుకోవాలి. వాళ్లకున్న క్షేత్రం చిన్నదైతే, వేరే భాష మాట్లాడే సంఘాలు, వాళ్ల క్షేత్రంలో కొన్ని ఇళ్లకు వెళ్లకుండా ఉండవచ్చు. కానీ వాళ్ల క్షేత్రం ఎక్కువ ప్రాంతంలో విస్తరించి ఉండడం వల్ల క్షేత్రాన్ని పూర్తి చేయలేక పోతుంటే ఏమి చేయవచ్చు? అన్ని ఇళ్లు మాట్లాడుతూ వేరే భాష మాట్లాడే వాళ్లు ఎవరైనా ఆసక్తి చూపిస్తే, అదే భాష మాట్లాడే సంఘానికి వాళ్ల వివరాలు ఇవ్వడం మంచిది. (od 93వ పేజీ, 37వ పేరా) లేదా తమ భాష మాట్లాడే ప్రజల్ని గుర్తించి, వాళ్ల అడ్రస్‌లను తెలియజేయమని, వేరే భాష సంఘం మీ సంఘాన్ని కోరవచ్చు. (km 2/14 5వ పేజీ, బాక్సు) కొన్నిసార్లు, ఒకే ఇంటివాళ్లు వేర్వేరు భాషలు మాట్లాడే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. వేరేవాళ్ల వివరాలు తెలియజేయడానికి సంబంధించి మీ దేశంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా టెరిటరీని పూర్తి చేయడానికి చేసిన ఏర్పాట్లు ఉండాలి.

  • ఒక క్షేత్రంలో ఇళ్లు

    సహకరించుకోండి (ఎఫె 4:16): మీ సేవా పర్యవేక్షకుడి దగ్గర నుండి వచ్చిన ఏ నిర్దేశాన్ని అయినా జాగ్రత్తగా పాటించండి. మీ సంఘానికి సంబంధించిన భాషను కాకుండా వేరే భాషను కోరుకున్న వాళ్లతో మీరు బైబిలు స్టడీ చేస్తున్నారా? ఆ విద్యార్థి మాట్లాడే భాషకు సంబంధించి మీకు దగ్గర్లో ఉన్న సంఘం లేదా గ్రూపుకు ఆ స్టడీని అప్పగిస్తే, ఆ విద్యార్థి త్వరగా ప్రగతి సాధించవచ్చు.

  • భాషను సెలెక్ట్‌ చేసుకునే గుర్తు

    సిద్ధపడండి (సామె 15:28; 16:1): మీ క్షేత్రంలో వేరే భాష మాట్లాడేవాళ్లు ఎవరైనా ఎదురైతే వాళ్లకు మంచివార్త చెప్పడానికి మీరు పూర్తిగా కృషి చేయండి. మీ క్షేత్రంలో ఏయే భాషలు మాట్లాడేవాళ్లు ఉండవచ్చో ముందే ఊహించి, వాటికి సంబంధించిన బైబిలు అనువాదాలు, వీడియోలు డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోవడం ద్వారా మీరు చక్కగా సిద్ధపడి ఉండవచ్చు. కొన్ని భాషల్లో ఎలా పలకరించాలో తెలుసుకోవడానికి మీరు JW ల్యాంగ్వేజ్‌ యాప్‌ కూడా ఉపయోగించవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి