దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 1-3
క్రైస్తవ సంఘం మీద పవిత్రశక్తి కుమ్మరించబడింది
క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున యెరూషలేములో ఉన్న చాలామంది యూదులు వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చారు. (అపొ 2:9-11) వాళ్లు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నప్పటికీ, తమ పూర్తి జీవితమంతా వేరే దేశంలో జీవించి ఉండవచ్చు. (యిర్మీ 44:1) అందుకే వాళ్లలో కొంతమంది యూదుల్లా కాకుండా, వేషభాషల్లో తమ సొంత దేశానికి చెందిన వాళ్లలా కనిపించారు. ఇలా వేర్వేరు దేశాల నుండి వచ్చిన వాళ్లలో 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు క్రైస్తవ సంఘం ఒక్కసారిగా వివిధ రకాల ప్రజలతో నిండిపోయింది. వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చినా, “వాళ్లు ప్రతీరోజు ఒకే మనసుతో ఆలయంలో కలుసుకుంటూ” ఉన్నారు.—అపొ 2:46.
మీరు నిజమైన ఆసక్తిని ఎలా చూపించవచ్చు. . .
మీ క్షేత్రంలో ఉన్న వేరే దేశస్థులపట్ల?
వేరే దేశం నుండి వచ్చి మీ సంఘంతో సహవసిస్తున్న సహోదరసహోదరీలపట్ల?