పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—వేరే భాష మాట్లాడేవాళ్లకు సాక్ష్యమివ్వండి
ఎందుకు ప్రాముఖ్యం? “ప్రతి జనములో” ఉన్న ప్రజలు ఆధ్యాత్మికంగా ప్రయోజనం పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు. (అపొ. 10:34, 35) కాబట్టి, “లోకమందంతట” “సకల జనములకు” సువార్త ప్రకటించే పని జరుగుతుందని యేసు చెప్పాడు. (మత్త. 24:14) “ఆయా భాషలు మాటలాడు అన్యజనులు” సువార్త వింటారని జెకర్యా ప్రవచించాడు. (జెక. 8:23) అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూసినట్టు మహాశ్రమల నుండి తప్పించుకున్న వాళ్లలో “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండి” వచ్చినవాళ్లు ఉంటారు. (ప్రక. 7:9, 13, 14) పైన చూసినదాన్నిబట్టి మనం ప్రకటించే ప్రాంతంలో వేరే భాష మాట్లాడే వాళ్లను కలిస్తే, వాళ్లకు సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నించాలి.
ఈ నెలలో దీన్ని ప్రయత్నించండి:
మీ తర్వాతి కుటుంబ ఆరాధనలో, మీ భాష మాట్లాడని వాళ్లకు సాక్ష్యమిస్తున్నట్లు ప్రాక్టీసు చేయండి.