నవంబరు 19-25
అపొస్తలుల కార్యాలు 4-5
పాట 73, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“వాళ్లు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నారు”: (10 నిమి.)
అపొ 4:5-13—పేతురు, యోహానులు చదువులేని సామాన్యులైనా, అధికారులు, శాస్త్రుల దగ్గర తమ నమ్మకాలను సమర్థించుకోవడానికి వెనకాడలేదు. (w08-E 9/1 15వ పేజీ, బాక్సు; w08 5/15 30వ పేజీ, 6వ పేరా)
అపొ 4:18-20—బెదిరింపులు ఎదురైనా పేతురు, యోహాను ప్రకటనా పనిని ఆపడానికి ఒప్పుకోలేదు
అపొ 4:23-31—మొదటి శతాబ్ద క్రైస్తవులు ధైర్యం కోసం యెహోవా పవిత్రశక్తి మీద ఆధారపడ్డారు (it-1-E 128వ పేజీ, 3వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
అపొ 4:11—యేసు ఏ విధంగా ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు? (it-1-E 514వ పేజీ, 4వ పేరా)
అపొ 5:1—అననీయ, సప్పీరాలు వాళ్ల ఆస్తిలో కొంత భాగాన్ని ఎందుకు అమ్మారు? (w13 4/1 9వ పేజీ, 4వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 5:27-42
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి. మీ టెరిటరీలో ఎక్కువగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతను ఇంటివాళ్లు లేవదీస్తారు.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి. తాను క్రైస్తవుణ్ణి కానని ఇంటి వ్యక్తి చెబుతాడు.
రెండవ రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మన క్రైస్తవ జీవితం
“కార్ట్ ద్వారా సాక్ష్యం ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రయోజనాలు”: (15 నిమి.) సేవా పర్యవేక్షకుడు చర్చిస్తాడు. వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా కూటాలు, పరిచర్య). మీ సంఘం టేబుల్‌ను లేదా కార్టును ఉపయోగించుకొని బహిరంగ సాక్ష్యం ఇస్తుంటే, ఆ కార్టు లేదా టేబుల్‌ని వేదిక మీద నుండి ప్రేక్షకులకు చూపించండి. మీ ప్రాంతంలో చేసిన ఏర్పాట్ల గురించి చెప్పండి. సమయం ఉంటే ఒక మంచి స్థానిక అనుభవాన్ని చెప్పండి లేదా పునర్నటించి చూపించండి. ప్రచారకులు ఎలా పాల్గొనవచ్చో వివరించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 20వ అధ్యా., 17-19 పేరాలు, 216, 217, 218-219 పేజీల్లో బాక్సులు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 17, ప్రార్థన