మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం-ఆసక్తితో ఉన్నవాళ్లను మళ్లీ కలవండి
ఎందుకు ముఖ్యం: రాజ్య సందేశం పట్ల ఇష్టం చూపించిన చాలామంది దేవుని గురించిన సత్యాన్ని వెదుకుతున్నారు. (యెష 55:6) వాళ్లకు క్రమక్రమంగా బోధించడానికి, మనం వాళ్లను మళ్లీమళ్లీ కలవాలి. ప్రజలు రకరకాల సమస్యల్లో ఉన్నారు, కాబట్టి వాళ్లలో ఆసక్తిని పెంచే పద్ధతులు కూడా మనం మార్చుకోవాలి. మనం బాగా సిద్ధపడి, ప్రతిసారి ఒక లక్ష్యంతో వాళ్లను కలవాలి, మన అసలు లక్ష్యం బైబిలు అధ్యయనం చేయడమే. అలాచేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఎలా చేయాలి:
వీలైనంత త్వరగా కలవండి, కొద్ది రోజుల్లోనే కలవండి.—మత్త 13:19
స్నేహపూర్వకంగా, మర్యాదగా ఉండండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి
ఆప్యాయంగా పలకరించి మొదలుపెట్టండి. ఇంటివాళ్ల పేరుని ఉపయోగించండి. ఎందుకు వచ్చారో గుర్తుచేయండి అంటే ముందు మాట్లాడిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి, కొత్త పత్రిక ఇవ్వడానికి, మన వెబ్సైట్ చూపించడానికి, ఒక వీడియో చూపించడానికి లేదా బైబిలు స్టడీ ఎలా చేస్తామో చూపించడానికి వచ్చామని చెప్పండి. ఇంటివాళ్లు వేరే అంశం గురించి అడిగితే మీరు చెప్పాలని అనుకున్న విషయాన్ని మార్చుకోండి.—ఫిలి 2:4
దేవుని వాక్యంలో ఒక విషయాన్ని చెప్పి, మన ప్రచురణల్లో ఏమైనా ఇచ్చి మీరు వాళ్ల హృదయంలో వేసిన సత్యపు విత్తనానికి నీళ్లు పోయండి. (1 కొరిం 3:6) వాళ్లతో చక్కని సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి
మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి