జార్జియా దేశంలో ఆనందం వెల్లివిరిసే కుటుంబం బ్రోషురును ఇస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం? (T-32 కరపత్రం చివరి పేజీ)
ప్రశ్న: మనందరికీ కావాల్సిన వాటిలో సంతోషకరమైన కుటుంబ జీవితం ఒకటి. కానీ దానికి రహస్యం ఏంటి? కుటుంబంలో ప్రతి ఒక్కరు వాళ్లు చేయాల్సిన వాటిని ఎలా చేయవచ్చు? కుటుంబ సభ్యులందరూ చేయాల్సిన పనులను చెప్పే కొన్ని లేఖనాల్ని మీకు చూపించవచ్చా?
వచనం: ఎఫె 5:1, 2 లేదా కొలొ 3:18-21
ఇలా చెప్పవచ్చు: కుటుంబం సంతోషంగా ఉండడానికి లేఖనాల్లో ఉన్న సూత్రాలను ఈ పేపరు చూపిస్తుంది.
సత్యాన్ని బోధించండి
ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం . . .
పరిచయం: కుటుంబం గురించి ఉన్న ఈ చిన్న వీడియో చూపిస్తున్నాం. [ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం బ్రోషురును పరిచయం చేసే వీడియో చూపించండి.]
ఇలా చెప్పవచ్చు: ఈ వీడియోలో చూపించిన బ్రోషురును మీరు చదవాలనుకుంటే నేను మీకు ఒకటి ఇస్తాను, లేదా మీరు దాన్ని వెబ్సైట్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను.
మీరు ఎలా ఇస్తారో రాయండి:
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.