స్విట్జర్లాండ్లో రాజ్యమందిరానికి మరమ్మతులు చేస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం? (T-32 మొదటి పేజీ )
ప్రశ్న: మన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటాం. ప్లీజ్ కొంచెం ఈ ప్రశ్న చూస్తారా. దీని గురించి మీరు ఏమంటారు: “కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం?”
వచనం: లూకా 11:28
ఇలా చెప్పవచ్చు: కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడానికి సంబంధించి ప్రాచీన గ్రంథం చెప్పే కొన్ని విషయాలు ఈ పేపరులో ఉన్నాయి.
సత్యాన్ని బోధించండి
ప్రశ్న: రాబోయే రోజులు ఎలా ఉంటాయో మనం తెలుసుకోగలమా?
వచనం: యెష 46:10
సత్యం: రాబోయే రోజులు ఎలా ఉంటాయో పవిత్ర లేఖనాల ద్వారా దేవుడు వివరిస్తున్నాడు.
ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం . . .
ఉపోద్ఘాతం: కుటుంబాలకు సంబంధించిన ఒక చిన్న వీడియో చూపిస్తున్నాం. [ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం వీడియో చూపించండి.]
ఇలా చెప్పవచ్చు: మీరు వీడియోలో చూసిన ఈ బ్రోషురు చదవాలనుకుంటే నేను మీకు ఫ్రీగా ఇస్తాను లేదా వెబ్‌సైట్ నుండి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను.
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.