ఘానాలో మంచివార్త ప్రకటిస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉంది? (T-33)
ప్రశ్న: సైన్స్, టెక్నాలజీ మనకు చాలా ఉపయోగపడుతుంది. కానీ అదే సమయంలో మనుషులు వాళ్ల సొంత లాభం కోసం సైన్స్‌ను ఉపయోగించుకోవడం వల్ల కాలుష్యం, హింస, గొడవలు ఎక్కువైపోయాయి. దీని పరిష్కారం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
వచనం: కీర్త 72:13, 14
ఇలా చెప్పవచ్చు: లోకం ఎవరి చేతుల్లో ఉందో, మనుషులు ఒకరిమీద ఒకరు స్వార్థంతో ఆధిపత్యం చేయడం వల్ల వచ్చిన చెడు ఫలితాలను దేవుడు ఎలా తీసేస్తాడో ఈ పేపరులో ఉంది.
సత్యాన్ని బోధించండి
ప్రశ్న: లోకాంతం దగ్గర్లో ఉందా?
వచనం: మత్త 24:3, 7, 8, 14
సత్యం: మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని పవిత్ర గ్రంథాల్లో ప్రవచనాలు చూపిస్తున్నాయి. ఇది మంచివార్తే, ఎందుకంటే త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి.
మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? (kt)
ప్రశ్న: మనలో చాలామంది కొన్ని ప్రశ్నల గురించి ఆలోచిస్తారు, దేవుడు మనల్ని పట్టించుకుంటాడా? బాధలు ఎప్పటికైనా లేకుండా పోతాయా? జీవితంలో నిజమైన సంతోషాన్ని ఎలా పొందాలి? ఇంకా, ఇలాంటివి ఎన్నో. వీటికి జవాబులు మనకు దొరకుతాయంటారా?
వచనం: యోహాను 17:17
ఇలా చెప్పవచ్చు: ఈ ట్రాక్ట్‌లో ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నిజమైన, సరళమైన జవాబులు ఉన్నాయి.
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.