మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం ఆసక్తి చూపించిన వాళ్లని కలిసే ముందు ఏమేమి చేయాలి?
ఎందుకు ప్రాముఖ్యం?
సత్యం గురించి మనం నాటిన విత్తనాలకు నీళ్లు పోయాలి అని కోరుకుంటాం. (1 కొరిం 3:6) ఎవరైనా ఆసక్తి చూపిస్తే వాళ్లను ఒక ప్రశ్న అడిగి వస్తే మంచిది. తిరిగి వెళ్లినప్పుడు ఆ ప్రశ్న గురించి మాట్లాడవచ్చు. అప్పుడు వాళ్లు మనం అడిగిన ప్రశ్న గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తారు. మనం మళ్లీ వాళ్లను కలిసినప్పుడు ఏం మాట్లాడాలి అని ఎక్కువ ఆలోచించకుండా ఆ ప్రశ్న గురించే మాట్లాడవచ్చు. ‘పోయినసారి మిమ్మల్ని కలిసినప్పుడు అడిగిన ప్రశ్న గురించి మాట్లాడడానికి వచ్చాము,’ అని చెప్పవచ్చు.
ఎలా చేయాలి?
ఇంటింటి పరిచర్యలో ఏం మాట్లాడాలో సిద్ధపడేటప్పుడే పునర్దర్శనం కోసం అవసరమైన ప్రశ్న కూడా తయారు చేసుకోండి. అది మీరు ఇస్తున్న పత్రికలో ఉన్న ప్రశ్న కావచ్చు. లేదా మీరు తిరిగి కలిసినప్పుడు చూపించాలనుకుంటున్న స్టడీ పుస్తకంలో ఉన్న ప్రశ్న కూడా కావచ్చు.
ఆసక్తి చూపించిన వాళ్ల దగ్గర నుండి వచ్చేసే ముందు, వాళ్లతో మళ్లీ మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పి, ముందే తయారు చేసుకున్న ప్రశ్న అడగండి. వీలైతే వాళ్ల ఫోన్ నెంబర్ లేదా అడ్రస్ తీసుకోండి.
ఫలానా సమయానికి వస్తామని మీరు వాళ్లతో చెప్తే, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.—మత్త. 5:37.