దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఎజ్రా 6-10
ఇష్టంగా పనిచేసే సేవకులు యెహోవాకు కావాలి
ఎజ్రా యెరూషలేముకు తిరిగి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు
యెరూషలేముకు తిరిగి వెళ్లి అక్కడ యెహోవా ఆరాధనను ముందుకు తీసుకువెళ్లడానికి ఎజ్రాకు రాజైన అర్తహషస్త నుండి అనుమతి వస్తుంది
ఎజ్రా యెహోవా మందిరం కొరకు “ఏ మనవి చేసినను” బంగారం, వెండి, గోధుమలు, ద్రాక్షారసం, నూనె, ఉప్పు అన్నిటిని రాజు అనుగ్రహించాడు. వాటి ధర నేడున్న ధర ప్రకారం 660 కోట్ల రూపాయలు
యెహోవా తన సేవకుల్ని కాపాడతాడని ఎజ్రా నమ్మాడు
యెరూషలేముకు ప్రయాణం చాలా కష్టంగా ఉండొచ్చు
బహుశా ఆ భయంకరమైన దారిలో కనీసం 1600 కిలోమీటర్లు ప్రయాణించాలి
ఈ ప్రయాణం నాలుగు నెలలు పట్టి ఉంటుంది
యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లకు గట్టి విశ్వాసం, సత్యారాధన అంటే ఎంతో ఆసక్తి, ధైర్యం అవసరమైంది
ఎజ్రా వీటితో ప్రయాణించాడు . . .
750 తలాంతుల బరువున్న బంగారం, వెండి అంటే దాదాపు మూడు పెద్ద ఏనుగుల బరువుతో సమానం!
ప్రయాణిస్తున్న వాళ్లకు ఎదురైన ఇబ్బందులు . . .
దొంగల దండు, ఎడారి, కొండ ప్రాంతాలు, భయంకరమైన క్రూర మృగాలు