మన క్రైస్తవ జీవితం
సత్యారాధన కొరకు మందిరాలను నిర్మించి వాటిని చూసుకోవడం మనకున్న గొప్ప అవకాశం
ఇశ్రాయేలులో దేవాలయాన్ని కట్టడానికి చాలా పని చేయాల్సివచ్చింది, ఎంతో ఖర్చు కూడా పెట్టాల్సివచ్చింది. కానీ ఇశ్రాయేలీయులు ఉత్సాహంతో ఆ పనికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. (1 దిన 29:2-9; 2 దిన 6:7, 8) కట్టిన తర్వాత ఇశ్రాయేలీయులు ఆ ఆలయాన్ని ఎలా చూసుకుంటారు అనేదాన్నిబట్టి వాళ్లకు దేవుని మీద భక్తి ఉందో లేదో తెలుస్తుంది. (2 రాజు 22:3-6; 2 దిన 28:24; 29:3) ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు ఎంతో సమయాన్ని శక్తిని పెట్టి రాజ్యమందిరాలను, సమావేశ హాళ్లను నిర్మిస్తున్నారు, శుభ్రంగా ఉంచుతున్నారు, అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. యెహోవాతో కలిసి ఇలా పని చేయడం మనకు దొరికిన గొప్ప అవకాశం, మనం చేసే పవిత్ర సేవలో ఒక భాగం.—కీర్త 127:1; ప్రక 7:15.
మనమేమి చేయవచ్చు
ప్రతీ మీటింగ్ తర్వాత శుభ్రం చేయాలి. మీరు అలా చేయలేకపోతే మీరు కూర్చున్న దగ్గర శుభ్రం చేయండి.
రాజ్య మందిరాన్ని శుభ్రం చేయడానికి, మరమ్మతులు చేయడానికి ఉన్న ఏర్పాట్లలో ఎప్పుడూ పాల్గొనాలి. ఎక్కువ చేతులు కలిస్తే పని చక్కగా సులువుగా అయిపోతుంది.—lv 105 ¶18.
ఆర్థిక మద్దతు ఇవ్వవచ్చు. మీరు హృదయపూర్వకంగా ఇచ్చే విరాళం ‘రెండు కాసులంత’ తక్కువైనా యెహోవాకు సంతోషం కలుగుతుంది.—మార్కు 12:41-44.
మనకు వీలైతే ఆరాధన కోసం మందిరాలను కట్టడానికి, వాటిని బాగుచేయడానికి సహాయం చేయవచ్చు. అందుకు ఆ పనిలో అనుభవం ఉండాల్సిన అవసరం లేదు.