ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
ఫిబ్రవరిలో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“త్వరలోనే పరిస్థితులు మెరుగౌతాయని చాలామంది ఆశిస్తున్నారు. మీరూ అలాగే అనుకుంటున్నారా? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ ప్రశ్నకు జవాబిచ్చే ఒక లేఖనాన్ని మీకు చదివి వినిపించమంటారా?” గృహస్థులు ఆసక్తి చూపిస్తే, కీర్తన 37:10, 11 చదవండి. ఆ తర్వాత కావలికోట జనవరి - మార్చి సంచికను ఇచ్చి, 13వ పేజీలోని చివరి ఉపశీర్షిక కిందవున్న సమాచారాన్ని చదివి చర్చించండి. పత్రిక ఇచ్చి, 4వ ప్రశ్నకు జవాబును పరిశీలించడానికి ఏర్పాటు చేసుకోండి.
కావలికోట జనవరి - మార్చి
24వ పేజీలోని శీర్షిక చూపించి ఇలా అడగండి: “దీని గురించి మీరేమనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ ప్రశ్నకు జవాబిచ్చే ఒక లేఖనాన్ని మీకు చదివి వినిపించమంటారా? [గృహస్థులు ఆసక్తి చూపిస్తే 1 యోహాను 5:19 చదవండి.] దీని ప్రకారం, “దుష్టుడు” అంటే అపవాది లోకాన్ని పరిపాలిస్తున్నాడని తెలుస్తోంది. అయితే మనకు కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అపవాది ఎక్కడ నుండి వచ్చాడు? అతడు నిజమైన వ్యక్తేనా? దేవుడు ఎంతకాలం అతణ్ణి పరిపాలించనిస్తాడు? వీటి గురించి బైబిలు ఏమి చెబుతోందో ఈ పత్రిక తెలియజేస్తోంది.”