ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
కావలికోట ఏప్రిల్ - జూన్
“మనందరం కొంతవరకైనా సంతృప్తిగా ఉండాలని కోరుకుంటాం. సంతృప్తిగా ఉండడానికి డబ్బు అవసరమవుతుందా, మీరేమంటారు? [వాళ్లు చెప్పేది వినండి.] ఉన్నదానిలో సంతృప్తిగా ఉండడం గురించి ఒక దేవుని సేవకుడు చెప్పినదాన్ని మీకు చూపించమంటారా? [గృహస్థులు ఆసక్తి చూపిస్తే ఫిలిప్పీయులు 4:11, 12 చదవండి.] సంతృప్తిగా ఉండడానికి సహాయం చేసే ఐదు రహస్యాల గురించి ఈ పత్రిక తెలియజేస్తోంది.”