అత్యవసర పరిస్థితుల్లో ఏ చికిత్స చేయించుకోవాలో నిర్ణయించుకున్నారా?
అత్యవసరంగా వైద్య చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు ఎదురౌతుందో మనకు తెలియదు. (యాకో. 4:14) అందుకే, తెలివైన వాళ్ళు వీలైనంత వరకు ముందుచూపుతో ఉంటారు. (సామె. 22:3) మీరు ఎలాంటి వైద్య విధానాలను, చికిత్సలను అంగీకరిస్తారో నిర్ణయించుకున్నారా? వాటిని రాసి పెట్టుకున్నారా? ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి, నవంబరు 2006 మన రాజ్య పరిచర్యలో, “రక్తంలోని సూక్ష్మభాగాలను, నా రక్తం ఇమిడివున్న వైద్యవిధానాలను నేనెలా దృష్టిస్తాను?” అనే ఆర్టికల్ ప్రచురించారు.
అడ్వాన్స్ హెల్త్ కేర్ డైరెక్టివ్ కార్డును ఇంట్లోనే నింపవచ్చు, కానీ ఇద్దరు సాక్షుల సమక్షంలో మాత్రమే తేదీ రాసి, సంతకం చేయాలి. క్షేత్రసేవా గుంపు పర్యవేక్షకుని సహాయంతో లేదా మరో పెద్ద సహాయంతో రాజ్యమందిరంలో దీన్ని చేయవచ్చు. కార్డులో “స్టేట్మెంట్ ఆఫ్ విట్నెసెస్” దగ్గర చెప్పినట్లు సాక్షుల సమక్షంలో సంతకం చేయడం చాలా ప్రాముఖ్యం. కొత్త కార్డులు నింపడానికి ఎవరికైనా సహాయం అవసరమేమో గుంపు పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలి. ప్రతీ సంవత్సరం కొత్త కార్డు నింపాలని గుర్తుంచుకోండి. ప్రచారకులు తమతోపాటు అసలు డైరెక్టివ్ను ఉంచుకోవాలి, జిరాక్స్ కాపీని కాదు.
కొన్నిరకాల చికిత్సలను అంగీకరించాలా వద్దా అనేది మనస్సాక్షి ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, మీరు ఏ విధమైన చికిత్సలను అంగీకరిస్తారో, వేటిని అంగీకరించరో నిర్ణయించుకోవడానికి అత్యవసర పరిస్థితులు వచ్చేంతవరకు ఆగకండి. కార్డు ఇంగ్లీషులో ఉంటుంది కాబట్టి అందులో మీకేదైనా సరిగ్గా అర్థం కాకపోతే, మీ సంఘంలో ఇంగ్లీషు బాగా తెలిసినవాళ్లను ఎవరినైనా అందులోని విషయాలను స్పష్టంగా వివరించమని అడగండి. వేరేవాళ్ల కార్డు చూసి నింపకండి. రక్తంలోని సూక్ష్మభాగాలు, రక్తం ఇమిడివున్న వైద్య పద్ధతులకు సంబంధించి ప్రతీ వ్యక్తి ప్రార్థన చేసి, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. “దేవుని ప్రేమ” పుస్తకంలోని 7వ అధ్యాయం, దానిలోని రెఫరెన్సులు, అలాగే నవంబరు 2006 మన రాజ్య పరిచర్య అనుబంధంలోని సమాచారం మీరే ఆలోచించుకుని, నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తాయి. మీరు బాప్తిస్మం తీసుకుని ఉంటే అడ్వాన్స్ హెల్త్ కేర్ డైరెక్టివ్ కార్డు మీద మీరు ఎంపిక చేసుకున్నవాటిని రాసి, దాన్ని ఎప్పుడూ మీతోపాటే ఉంచుకోండి.
[3వ పేజీలోని బ్లర్బ్]
మీరు ఎలాంటి వైద్య విధానాలను, చికిత్సలను అంగీకరిస్తారో నిర్ణయించుకున్నారా? వాటిని రాసి పెట్టుకున్నారా?