కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/10 పేజీ 3
  • వాయిదా వేస్తున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాయిదా వేస్తున్నారా?
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు దాన్ని వాయిదా వేస్తున్నారా?
    మన రాజ్య పరిచర్య—2008
  • అత్యవసర పరిస్థితుల్లో ఏ చికిత్స చేయించుకోవాలో నిర్ణయించుకున్నారా?
    మన రాజ్య పరిచర్య—2012
  • మీరు ఏవి ఎంపిక చేసుకునే అవకాశముందో మీకు తెలుసా?
    మన రాజ్య పరిచర్య—2009
  • మీరు ఏవి ఎంపిక చేసుకునే అవకాశముందో మీకు తెలుసా?
    మన రాజ్య పరిచర్య—2011
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2010
km 1/10 పేజీ 3

వాయిదా వేస్తున్నారా?

దేన్ని వాయిదా వేయడం గురించి మాట్లాడుకుంటున్నాం? బాప్తిస్మం తీసుకున్న సాక్షుల కోసం తయారు చేయబడిన అడ్వాన్స్‌ హెల్త్‌కేర్‌ డైరెక్టివ్‌ కార్డు నింపడం గురించి. “రేపేమి సంభవించునో మీకు తెలియదు” కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో మీరు ఎలాంటి చికిత్స చేయించుకోవాలని అనుకుంటున్నారో, ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకుని, దానిని రాతపూర్వకంగా తెలియజేయడం చాలా ప్రాముఖ్యం. (యాకో. 4:14; అపొ. 15:28, 29) ప్రతి సంవత్సరం ఒక కొత్త కార్డును నింపాలి. సాక్షులైన తల్లిదండ్రులు ఇంకా బాప్తిస్మం తీసుకోని తమ పిల్లల కోసం ఐడెంటిటీ కార్డులను తీసుకుని వాటిని పూర్తిగా నింపి తమ పిల్లల దగ్గర ఉంచాలి.

మీకూ మీ పిల్లలకూ ఎలాంటి వైద్య చికిత్స చేయించుకోవాలని అనుకుంటున్నారో, ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా నిర్ణయించుకుని, అడ్వాన్స్‌ హెల్త్‌కేర్‌ డైరెక్టివ్‌ కార్డు నింపారా? ఈ విషయాల గురించిన పూర్తి వివరాల కోసం కావలికోట జూన్‌ 15, 2004 సంచికలోని పాఠకుల ప్రశ్నలు అనే భాగాన్ని, నవంబరు 2006 మన రాజ్య పరిచర్య లోపలి పేజీల్లోవున్న “రక్తంలోని సూక్ష్మభాగాలను, నా రక్తం ఇమిడివున్న వైద్యవిధానాలను నేనెలా దృష్టిస్తాను?” అనే భాగాన్ని జాగ్రత్తగా చదవండి. చివరిగా, మీరు నిర్ణయించుకున్నట్లే అడ్వాన్స్‌ హెల్త్‌కేర్‌ డైరెక్టివ్‌ కార్డు నింపారో లేదో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబంలో సాక్షులు కానివారెవరైనా ఉంటే, మీరు తీసుకున్న నిర్ణయాల గురించి వారికి పూర్తిగా వివరించడం మర్చిపోవద్దు.

అడ్వాన్స్‌ హెల్త్‌కేర్‌ డైరెక్టివ్‌ కార్డు ఇంటివద్ద నింపవచ్చు. అయితే ఇద్దరు సాక్షుల సమక్షంలో మాత్రమే దానిమీద తేదీ రాసి, సంతకం చేయాలి. ఇప్పుడు, గుంపు పైవిచారణకర్త లేదా మరో పెద్ద సహాయంతో రాజ్య మందిరంలో సంతకం చేయవచ్చు. కార్డులో “స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ విట్నెసెస్‌” (STATEMENT OF WITNESSES) అనే అంశం కింద ఉన్నట్లు, సాక్షుల సమక్షంలో సంతకం చేయడం చాలా ప్రాముఖ్యం. గుంపు పైవిచారణకర్తలు కొత్త కార్డులను నింపని వారికి సహాయం అవసరమేమో అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉండాలి.

ఇంగ్లీషు చదవడం, అర్థం చేసుకోవడం వచ్చిన వాళ్లంతా అడ్వాన్స్‌ హెల్త్‌కేర్‌ డైరెక్టివ్‌ను (dpa-E In 11/04) ఉపయోగిస్తారు. ఇంగ్లీషు చదవడం, అర్థం చేసుకోవడం రానివాళ్ల కోసం రెండవ కార్డు (dpa-1-E In 11/04) తయారుచేయబడింది. అందులో అదనంగా ఒక ప్రశ్న ఉంటుంది. అది 8వ ప్రశ్న. ఈ ప్రశ్న దగ్గర, డైరెక్టివ్‌ను నింపి, సంతకం చేసిన ప్రచారకునికి కార్డులోని విషయాలు చదివి వినిపించి, వాటిని వివరించిన వ్యక్తి పేరు ఉంటుంది. ప్రచారకులు తమవద్ద డైరెక్టివ్‌ జిరాక్స్‌ కాపీ కాదుగానీ, అసలు కాపీనే ఉంచుకోవాలి.

[3వ పేజీలోని బాక్సు]

• మీకూ మీ పిల్లలకూ ఎలాంటి వైద్య చికిత్సను చేయించుకోవాలని అనుకుంటున్నారో లేదా ఎలాంటి చికిత్సా పద్ధతులను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా?

• అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా, పూర్తిగా నింపిన అడ్వాన్స్‌ హెల్త్‌కేర్‌ డైరెక్టివ్‌ ఎప్పుడూ మీతో ఉంచుకుంటున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి