ప్రాముఖ్యమైన ఒక వైద్య ప్రవృత్తిని నొక్కిచెప్పే వీడియో
రోగుల నైతిక దృక్కోణాలకూ, హక్కులకూ న్యాయ, వైద్య వృత్తుల్లో ఉన్నవారు అధిక శ్రద్ధనిస్తున్నారు. వీటినుండి యెహోవాసాక్షులు ప్రయోజనం పొందగల కొత్త వైద్య విధానాలకు, పద్ధతులకు అది మంచి ఆరంభాన్నిచ్చింది. (అపొ. 15:28, 29) మార్పిడి—ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణ—రోగి అవసరాలు, హక్కులు తీర్చడం (ఆంగ్లం) అనే వీడియో ముఖ్యోద్దేశం అదే. ఆ వీడియోను చూసి మీరేమి తెలుసుకున్నారో పునఃసమీక్షించుకోండి. గమనిక: ఆ వీడియోలో శస్త్రచికిత్సకు సంబంధించిన క్లుప్త దృశ్యాలు ఉన్నాయి కాబట్టి తమ చిన్నపిల్లలతోపాటు ఆ వీడియో చూసే విషయంలో తల్లిదండ్రులు వివేచన ఉపయోగించాలి.
(1) రక్తమార్పిడుల గురించి వైద్య సమాజంలోని కొందరెందుకు పునరాలోచిస్తున్నారు? (2) రక్తమార్పిడి లేకుండా చేయగల సంశ్లిష్ట శస్త్రచికిత్సలకు సంబంధించిన మూడు ఉదాహరణలు చెప్పండి. (3) ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు రక్తమార్పిడి లేకుండానే రోగులకు వైద్యం చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు? అలాచేయడానికి వారెందుకు సుముఖంగా ఉన్నారు? (4) రక్తాన్ని ఉపయోగించే విషయం గురించి ఇటీవల ఆస్పత్రి అధ్యయనాలు ఏమి వెల్లడించాయి? (5) రక్తమార్పిడులతో ఎలాంటి వైద్య ప్రమాదాలు ముడిపడి ఉన్నాయి? (6) మార్పిడి ప్రత్యామ్నాయాల ప్రయోజనాల గురించి అనేకమంది నిపుణులు ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? (7) రక్తహీనత కలగడానికి కారణమేమిటి? మానవులు ఏ స్థాయివరకు రక్తహీనతను తట్టుకోగలరు? రక్తపు లోటును పూరించడానికి ఏమి చేయవచ్చు? (8) రోగి శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తిని ఎలా ఉత్తేజపరచవచ్చు? (9) శస్త్రచికిత్స చేసే సమయంలో రక్తం నష్టపోవడాన్ని తగ్గించేందుకు ఎలాంటి సాంకేతిక పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి? (10) మార్పిడి ప్రత్యామ్నాయాలు చిన్నపిల్లలకు లేదా ప్రాణాపాయాన్ని కలిగించే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సమర్థవంతంగా పనిచేస్తాయా? (11) మంచి వైద్య సంరక్షణకు సంబంధించిన ప్రాథమిక నైతిక సూత్రాల్లో ఒకటి ఏమిటి? (12) క్రైస్తవులు రక్తరహిత చికిత్సను ముందే ఎంపిక చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? దీనిని మనమెలా చేయవచ్చు?
వీడియోలో చూపించబడిన కొన్ని చికిత్సా పద్ధతులను అంగీకరించడం, ప్రతీ వ్యక్తి బైబిలు శిక్షిత మనస్సాక్షి ప్రకారం వ్యక్తిగతంగా తీసుకోవలసిన నిర్ణయం. మీకు మీ పిల్లలకు ఏ మార్పిడి ప్రత్యామ్నాయాలను అంగీకరించడానికి మీరు ఇష్టపడుతున్నారో నిర్ణయించుకున్నారా? సాక్షులుకాని కుటుంబ సభ్యులకు కూడా మీ నిర్ణయాల గురించి, వాటి కారణాల గురించి పూర్తిగా వివరించాలి.—కావలికోట జూన్ 15, 2004, అక్టోబరు 15, 2000 సంచికల్లోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.