ప్రతీ సందర్భంలో దానిని ఉపయోగించండి
1. మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం ఏమి చేయడానికి ఉపయోగపడుతుంది?
మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం మనం బైబిలు అధ్యయనాలు ప్రారంభించేందుకు సహాయం చేయడానికి తయారుచేయబడింది. మనం సత్య విత్తనాలను వెదజల్లడానికి కూడా దీన్ని శక్తివంతమైన పనిముట్టుగా ఉపయోగించవచ్చు. (ప్రసం. 11:6) మనం దానిని సరిగ్గా ఉపయోగించడానికి సహాయపడే కొన్ని సలహాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
2. మొదటిసారి కలిసినప్పుడు కరపత్రాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
2 మొదటిసారి కలిసినప్పుడు: గృహస్థులకు నచ్చే విషయాలను మాట్లాడడానికి ప్రయత్నించండి. ఒకవేళ గృహస్థులు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టపడితే వాళ్లకు కరపత్రం ఇచ్చి, మొదటి పేజీలోని ఆరు ప్రశ్నలను చూపిస్తూ, “ఈ ప్రశ్నల్లో మీరు దేని గురించి ఆలోచించారు?” అని అడగవచ్చు. వాళ్లు సమాధానం చెప్పిన తర్వాత, వాళ్లు అడిగిన ప్రశ్నల్లో ఒకదానికి బైబిలు ఇస్తున్న సమాధానాన్ని చూపించడానికి కరపత్రంలో ఉన్న లేఖనాల్లో ఒకదాన్ని వాళ్లతో చర్చించాలి. వెనక పేజీలో ఉన్న సమాచారాన్ని చదవండి. వాళ్లు కరపత్రం చదవడానికి ఇష్టపడితే దాన్ని వాళ్లకు ఇవ్వండి. సత్యం వాళ్ల హృదయంలో నాటుకోవడానికి అది సహాయం చేయవచ్చు. (మత్త. 13:23) గృహస్థులకు బైబిలు మీద గౌరవముందని మనకు అనిపిస్తే, మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఇవ్వండి.
3. ఆసక్తివున్న గృహస్థులు బిజీగా ఉంటే మనం ఏమి చేయవచ్చు?
3 ఆసక్తివున్న గృహస్థులు బిజీగా ఉంటే: “ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు కాబట్టి, ఈ బైబిలు కరపత్రం ఇమ్మంటారా? మనలో చాలామంది సాధారణంగా ఈ ఆరు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటారు. ఈ ప్రశ్నల్లో ఒక్కోదానికి బైబిలు ఇస్తున్న సమాధానం ఈ కరపత్రంలో స్పష్టంగా ఉంది. వీటిలో దేని గురించైనా తెలుసుకోవాలనుకుంటే నేను మళ్లీ మీ దగ్గరకు వస్తాను” అని అనవచ్చు.
4. తోటి విద్యార్థులకు లేదా తోటి ఉద్యోగులకు కరపత్రాన్ని ఇస్తున్నప్పుడు మనం ఏమి చెప్పవచ్చు?
4 స్కూల్లో లేదా పనిస్థలం దగ్గర: మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో మీ స్నేహితులతో ఇలా మాట్లాడవచ్చు, “నువ్వెప్పుడైనా ఈ ప్రశ్నల్లో దేని గురించైనా తెలుసుకోవాలనుకున్నావా? [వాళ్లేమి చెప్తారో వినండి. ఒకవేళ అవతలి వ్యక్తి వినడానికి ఇష్టపడితే సంభాషణను కొనసాగించండి.] లేఖనాల్లో ఉన్న స్పష్టమైన, సమంజసమైన సమాధానాలను ఈ కరపత్రం తెలియజేస్తుంది” అని చెప్పవచ్చు. ఇంకా సమయముంటే, కరపత్రంలో ఉన్న సమాధానాల్లో ఒకదాన్ని వాళ్లతో చర్చించవచ్చు. అంతేకాదు, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని కూడా ఇవ్వవచ్చు.
5. మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం శక్తివంతమైన ప్రకటనా పనిముట్టు అని ఎందుకు చెప్పవచ్చు?
5 మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం, సత్యాన్ని సులువుగా అర్థంచేసుకునే విధంగా, సూటిగా తెలియజేస్తుంది. ఇది అన్ని మతాలవాళ్లకు, అన్ని సంస్కృతులవాళ్లకు ఆసక్తికరంగా ఉంటుంది. దీన్ని అందించడం సులభం; పిల్లలు, కొత్త ప్రచారకులు కూడా అందించవచ్చు. సరైన ప్రతీ సందర్భంలో మీరు దీన్ని ఉపయోగిస్తున్నారా?
6. కరపత్రం ఇచ్చే ప్రతీసారి గృహస్థులకు నిజంగా ఆసక్తి ఉందో లేదో ఎందుకు గమనించాలి?
6 వ్యతిరేకులు కరపత్రం పేరు చూసి మనల్ని తప్పుపట్టే అవకాశముంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సాహిత్యాలను తీసుకోమని మనం ఎవ్వరినీ బలవంతం చేయము. కాబట్టి, అవతలివాళ్లు ఆసక్తిగా ఉన్నారో లేదో గమనించి, సత్యం తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్లకు మాత్రమే కరపత్రాన్నివ్వండి.