డిసెంబరు 20తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
డిసెంబరు 20తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 16వ అధ్యా. 15-22 పేరాలు, 222వ పేజీలో ఉన్న బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 20-24
నం. 1: 2 దినవృత్తాంతములు 20:1-12
నం. 2: స్వచ్ఛమైన భాషను నేర్చుకోవాలన్నా, మాట్లాడాలన్నా ఏమి చేయాలి? (జెఫ. 3:9)
నం. 3: దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుటుంబం (fy 188-191 పేజీలు, 13-18 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: మీరు దానిని ప్రయత్నించారా? చర్చ. ప్రసంగం ఇస్తున్నప్పుడు, మన రాజ్య పరిచర్యలో ఇటీవల వచ్చిన “బైబిలు అధ్యయనం ఎలా చేస్తామో చూపించారా?,” “ప్రకటనా పని చేసేందుకు కొత్తవారికి శిక్షణ ఇవ్వండి,” (km 5/10) “మీరు అనియత సాక్ష్యం ఇవ్వగలరు!” (km 8/10) అనే ఆర్టికల్స్లోని సమాచారాన్ని క్లుప్తంగా చర్చించండి. ఈ ఆర్టికల్స్లోని సలహాలను పాటించడానికి ఎలా ప్రయత్నించారో, వాటి నుండి ఎలా ప్రయోజనం పొందారో ప్రేక్షకులను చెప్పమనండి.
15 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—ఎంత సమాచారాన్ని చర్చించాలో నిర్ణయించుకోవడం.” ప్రశ్నాజవాబులు. బైబిలు అధ్యయనాలు నిర్వహించడంలో అనుభవం ఉన్న ఒక ప్రచారకుడు/ప్రచారకురాలు, 4-5 పేరాల్లో పేర్కొన్నవి జరగకుండా ఎలా జాగ్రత్తపడాలో ఒక కొత్త ప్రచారకునితో/ప్రచారకురాలితో చర్చిస్తున్నట్లు ప్రదర్శనలో చూపించండి.