కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/09 పేజీ 2
  • సేవాకూటానికి ఎలా సిద్ధపడాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవాకూటానికి ఎలా సిద్ధపడాలి?
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • సేవా కూటంలోని భాగాలను నిర్వహించేవాళ్లకు నిర్దేశాలు
    మన రాజ్య పరిచర్య—2010
  • సేవా కూటము మనలను ప్రతి సత్కార్యమునకు సిద్ధపరుస్తుంది
    మన రాజ్య పరిచర్య—1994
  • కూటములను ప్రయోజనకరముగా చేయుటలో మీ భాగము
    మన రాజ్య పరిచర్య—1990
  • ఉపదేశాత్మక సమాచారము, స్పష్టంగా అందించబడింది
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 5/09 పేజీ 2

సేవాకూటానికి ఎలా సిద్ధపడాలి?

1. సేవాకూటం ఉద్దేశం ఏమిటి, దాని నుండి మనమెలా పూర్తిగా ప్రయోజనం పొందవచ్చు?

1 పరిచర్యలో మంచి ఫలితాలు పొందేలా మనకు తర్ఫీదు ఇవ్వడానికి సేవాకూటం రూపొందించబడింది. ఈ కూటంలో, రాజ్య సువార్త ఎలా ప్రకటించాలి, శిష్యులను ఎలా చేయాలి, త్వరలోనే దేవుడు అమలు చేయబోయే తీర్పును ఎలా ప్రకటించాలి అనే విషయాలు పరిశీలించబడతాయి. (మత్త. 28:20; మార్కు 13:10; 2 పేతు. 3:7) మనం బాగా సిద్ధపడి, వ్యాఖ్యానించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఈ ప్రాముఖ్యమైన కూటం నుండి పూర్తిగా ప్రయోజనం పొందుతాం.

2. ప్రసంగం వినడానికి మనమెలా సిద్ధపడవచ్చు?

2 ప్రసంగం: ఈ భాగానికి సమాచారం ఎక్కడ నుండి తీసుకోవాలనేది సాధారణంగా ప్రసంగీకులకు ఇచ్చే సూచనల్లో ఉంటుంది. అందులో ఉన్న లేఖనాలతో సహా సమాచారాన్ని సమీక్షించి, దాన్ని పరిచర్య చేసేటప్పుడు ఎలా పాటించవచ్చో ఆలోచించండి.

3. ప్రశ్నాజవాబుల చర్చకు సిద్ధపడడానికి మనమేమి చేయవచ్చు?

3 ప్రశ్నా జవాబుల చర్చ: ఈ భాగాన్ని నిర్వహించే సహోదరుడు దీన్ని చిన్న ఉపోద్ఘాతంతో మొదలుపెట్టి, చాలావరకు కావలికోట అధ్యయనంలాగే నిర్వహించి, ముగింపులో క్లుప్తంగా సమీక్షిస్తాడు. ప్రతి పేరాలోని ముఖ్య విషయాలను మార్కు చేసుకుని, వాటిని క్లుప్తంగా చెప్పడానికి సిద్ధపడండి.

4. ప్రేక్షకులతో చర్చ అనే భాగానికి మనమెలా సిద్ధపడవచ్చు?

4 ప్రేక్షకులతో చర్చ: ఇదొక ప్రసంగంలా ఇవ్వబడుతుంది, అంతేకాదు ప్రసంగీకుడు కొన్ని విషయాలపై ప్రేక్షకులను వ్యాఖ్యానించమని అడుగుతాడు. మీరు ముఖ్య విషయాలను మార్కు చేసుకుని, అందులోని లేఖనాలను చదువుకునివుంటే, ప్రశ్నలు అడిగినప్పుడు జవాబు చెప్పగల్గుతారు. ఈ భాగాన్ని నిర్వహించే సహోదరుడు, ముఖ్య విషయాలను ప్రేక్షకులతో చెప్పించడానికి కృషి చేస్తాడు.

5. ప్రదర్శనల నుండి మనమింకా ఎక్కువ ప్రయోజనం ఎలా పొందవచ్చు?

5 ప్రదర్శనలు: కొన్ని భాగాల్లో, పరిశీలిస్తున్న సమాచారాన్ని స్థానిక క్షేత్రంలో ఎలా ఉపయోగించవచ్చో చూపించడానికి, సాధారణంగా ఎదురయ్యేలాంటి సందర్భాల ఆధారంగా ప్రదర్శనలు ఉంటాయి. ఈ ప్రదర్శనలను పెద్దలు లేదా అనుభవంగల ప్రచారకులు లేదా పయినీర్లు చేస్తారు. దీని కోసం మీరు సిద్ధపడడంలో భాగంగా, వాళ్లు సమాచారాన్ని ఎలా అందజేస్తారనేదాని గురించి ఆలోచించవచ్చు. నమూనా అందింపు ప్రదర్శించబడిన తర్వాత, మీరైతే దాని గురించి ఎలా చెప్తారో, వివిధ గృహస్థులతో ఎలా మాట్లాడతారో ఆలోచించండి. ప్రదర్శనలో ఉపయోగించే ప్రచురణను లేదా పత్రికను తప్పకుండా తెచ్చుకోవాలి. మీరు కుటుంబ ఆరాధన చేసుకునేటప్పుడు, ఈ అందింపులలో కొన్నిటిని ఎలా చేస్తే బాగుంటుందో తెలుసుకోడానికి పదే పదే వాటిని చేసి చూడడం ప్రయోజనకరంగా ఉంటుంది.

6. మనం సేవాకూటానికి ఎందుకు సిద్ధపడాలో కొన్ని కారణాలు చెప్పండి.

6 సేవాకూటంలోని భాగాలకు సంబంధించిన సమాచారాన్ని చదువుకుని, దాని గురించి ముందే ఆలోచించుకుని వస్తే సేవాకూటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అలా చేస్తే మనం ఎంతో ప్రోత్సాహాన్ని పొందడమేకాక ఇతరులను కూడా ప్రోత్సహిస్తాం. (రోమా. 1:11, 12) మనం సమయం తీసుకుని సేవాకూటానికి సిద్ధపడితే, మనకు అప్పగించబడిన పనిని చేయడానికి మరింత సంసిద్ధంగా ఉంటాం.—2 తిమో. 3:16, 17.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి