సేవా కూటము మనలను ప్రతి సత్కార్యమునకు సిద్ధపరుస్తుంది
1 సువార్త ప్రకటించు పని మరియు శిష్యులను చేసే పనిలో మరెక్కువగా పాల్గొనడానికి మనల్ని పురికొల్పి, సిద్ధపరచడమే సేవా కూటముయొక్క సంకల్పము. (2 తిమో. 3:17) అయిననూ, మనము కూటాల కొరకు సరిగ్గా సిద్ధపడకపోతే లేక మనము నేర్చుకున్న వాటిని అన్వయించడానికి విఫలమౌతే, లాభాలు తక్కువగా ఉంటాయి.
2 ముందుగా సిద్ధపడటం ఉపదేశాన్ని ఎక్కువగా గ్రహించడానికి సహాయం చేస్తుంది. ఉపయోగించబడే ప్రచురణలను పునఃపరిశీలించండి, మీరు దానిని చూడటానికి, పాలుపొందడానికి వీలగునట్లు వాటిని మీతోపాటు కూటాలకు తీసుకొని రండి. మంచి శ్రద్ధగల శ్రోతగా ఉండి, తరువాత ఉపయోగించడాని కొరకు నోట్సు వ్రాసుకోండి.
3 సంఘాధ్యక్షుడు జరగవలసిన కూటముల భాగాలను జాగ్రత్తగా పునఃపరిశీలిస్తాడు. వాటిని సిద్ధపడటానికి సామర్థ్యంగల, అర్హతగల పెద్దలు మరియు పరిచారకులు నియమింపబడతారు. (om పుట 70) కొద్దిమంది పెద్దలు మరియు పరిచారకులు ఉండే సంఘాలు అర్హతగల ఇతర సహోదరులు తమకు సహాయపడటానికి నియమించవచ్చు. (km 11/76, ప్రశ్నాభాగం) ప్రతి ప్రసంగీకుడు కూడ సంపూర్ణంగా సిద్ధపడాలి, ఇవ్వబడిన సూచనలను జాగ్రత్తగా పాటించాలి, మరి తాను తనకు ఇవ్వబడిన సమయం కంటే ఎక్కువ సమయాన్ని ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి.
4 సాధారణంగా కూటాలు ప్రకటనలతో ప్రారంభమౌతాయి. ఏ విషయాలను సూచించవలసిన అవసరత ఉందో తెలుసుకొనడానికి నియమించబడిన సహోదరుడు సంఘాధ్యక్షున్ని ముందే కలవాలి. అందులో సొసైటీ నుండి వచ్చిన ఉత్తరాలు లేక సేవా ఏర్పాట్లను గురించిన సూచనలు లేక నెలసరి రిపోర్టులు ఉండవచ్చు. దర్శించవలసిన అనారోగ్యులు ఉన్నారని మీరు తెలుసుకొనవచ్చు లేక భవిష్యత్తు కొరకు పథకం వేయబడిన సంఘ కార్యకలాపాల వివరాలను గురించి మీరు తెలుసుకొనవచ్చు. వాటిని మీరు తెలుసుకుని వాటిలో మీవంతు నిర్వహించటానికి సిద్ధంగా ఉండేలా మంచి అవధానమిచ్చి వినండి.
5 కూటములో ప్రేక్షకులు పాల్గొనవలసిన భాగం ఉన్నప్పుడు, ఆ భాగాన్ని చదివి, లేఖనాలను తెరిచి చూడటం ద్వారా సిద్ధపడండి. ఇవ్వబడిన సలహాలను మీరెలా అన్వయించుకొనడానికి పథకం వేస్తున్నారు మరి ఇతరులను ప్రోత్సహించడానికి మీరు ఏ విధమైన వ్యాఖ్యానాలను చేయగలరు అనే దాని గురించి ఆలోచించండి. ఒక చిన్న అనుభవాన్ని చెప్పడం ద్వారా ఉపదేశం యొక్క ఆచరణాత్మక విలువను మీరు చూపవచ్చు.
6 ఏదైనా ప్రదర్శన ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఉంచుకొనడానికి ప్రయత్నించి, మీరేమి చెప్తారో దాని గురించి ఆలోచించండి. ఉపయోగింపబడిన వాదనను, తర్కించిన పద్ధతిని గమనించండి. క్రితం సారి మీరు ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఏమి చెప్పారో జ్ఞాపకం తెచ్చుకొనడానికి ప్రయత్నించండి, మరి ప్రదర్శించబడిన విషయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందడానికి మీకు ఎలా సహాయం చేయగలవో పరిశీలించండి.
7 ప్రదర్శనలు మరియు పరిచయాలలో పాల్గొనేవారు ముందుగానే మంచిగా పూర్వాభ్యాసం చేయాలి. ప్రతి వారు తాను వేదికపైన ఏమి చెప్పబోతున్నారు మరి ఏమి చేయవలసి ఉంది అనే విషయాలను తెలుసుకొని ఉండాలి. పూర్వాభ్యాసం చేయని భాగాలు సాధారణంగా ప్రేక్షకులను ప్రేరేపించవు లేక ప్రోత్సహించవు. కొందరు తమ భాగాలను కావలికోట పఠనం తరువాత రిహార్సిల్ చేసుకొనడానికి సిద్ధపడి వస్తారు, ఎందుకంటే వారు వేదికపైన అభ్యాసము చేసి తమకు ఏమి అవసరమౌతాయో మైకులను చూసుకునే సహోదరులకు తెలియజేయడానికి వీలౌతుంది.
8 కార్యక్రమంలో కొన్నిసార్లు సంఘంయొక్క ప్రత్యేక అవసరాన్ని గురించి లేక సమయోచితమైన కావలికోట శీర్షిక నుండి ప్రసంగాలు ఉండవచ్చు. శ్రద్ధగా విని, సలహాను మనస్సులోకి తీసుకుని, దానిని అన్వయించటానికి ప్రయత్నించండి.
9 మనము “ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి” ఉండాలని కోరుకుంటాము. (2 తిమో. 2:21) దానిని చేయడంలో మనకు సహాయపడటానికి యెహోవా చేసే ఏర్పాట్లలో సేవా కూటము ఒకటి. నమ్మకంగా హాజరవ్వటం మరియు మనము నేర్చుకున్న దానిని ఉపయోగించడానికి చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం మనము మన “పరిచర్యను సంపూర్ణముగా జరిగించ” డానికి సహాయం చేస్తాయి.—2 తిమో. 4:5.