కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/09 పేజీ 2
  • సరిగా చదవలేనివారికి బోధించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సరిగా చదవలేనివారికి బోధించండి
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • చదవడం మీద శ్రద్ధ వహించండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సరిగ్గా చదవడం రానివాళ్లకు ఎలా సహాయం చేయాలి?
    మన రాజ్య పరిచర్య—2014
  • ప్రతిదినం బైబిలు చదవడం నుండి ప్రయోజనం పొందుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • బైబిల్ని ఎలా చదివితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 4/09 పేజీ 2

సరిగా చదవలేనివారికి బోధించండి

1. పరిచర్యలో మనకెలాంటి సవాలు ఎదురవ్వొచ్చు?

1 మనకు పరిచర్యలో అప్పుడప్పుడూ సరిగా చదవలేనివారికి సత్యాన్ని బోధించే సవాలు ఎదురవుతూవుంటుంది. అలాంటప్పుడు మనమేమి చేయవచ్చు?

2. సరిగా చదవలేనివారికి మనం ఎలా, ఎందుకు గౌరవం చూపించాలి?

2 వారిని కించపర్చకుండా గౌరవించండి: ఒక వ్యక్తి విద్యాభ్యాసాలు కాదుగానీ అతని హృదయం ఎలావుందనేదే యెహోవాకు ప్రాముఖ్యం. (1 సమూ. 16:7; సామె. 21:2) కాబట్టి మనం సరిగా చదవలేనివారిని చిన్నచూపు చూడము. మనం వారిపట్ల గౌరవం, సహనం చూపిస్తే వారు మన సహాయాన్ని అంగీకరించే అవకాశముంది. (రోమా. 12:10) అంటే మనం ఆ వ్యక్తిని ఫలానా వచనంగానీ పేరాగానీ చదవమని బలవంతం చేయకూడదు. వాళ్ళు అమూల్యమైన బైబిలు సత్యాల గురించి ఇంకా ఎక్కువగా నేర్చుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ‘దివారాత్రము’ స్వంతగా చదవాలనే ఉద్దేశంతో సరిగా చదవడం నేర్చుకోవాలనుకోవచ్చు.—కీర్త. 1:2, 3.

3. సరిగా చదవలేనివారికి బోధించేందుకు ఎలాంటి బోధనా పద్ధతులను ఉపయోగించవచ్చు?

3 బైబిలు అధ్యయనం చేయడానికి వివిధ పద్ధతులు: బోధించడానికి, నేర్చుకున్నదానిని గుర్తుంచుకునేలా సహాయం చేయడానికి పుస్తకంలోని బొమ్మలు చక్కగా పనికొస్తాయి. మీరు అధ్యయనం చేస్తున్న ప్రచురణలోవున్న బొమ్మ చూపించి బైబిలు విద్యార్థి ఏమి అర్థంచేసుకున్నారో అడగవచ్చు. ఆ తర్వాత, నిర్దిష్ట ప్రశ్నలు అడుగుతూ బొమ్మలోని విషయాన్ని అర్థం చేసుకునేలా సహాయం చేయండి. ఆ బొమ్మను వివరించే కొన్ని వచనాలు చూపించండి. నేర్చుకున్న అధ్యాయంలోని ముఖ్యమైన విషయాలను గుర్తుచేయడానికి కూడా బొమ్మలను ఉపయోగించవచ్చు. ఒకేసారి ఎక్కువ పేరాలను చర్చించకండి. పాఠంలో లేని విషయాలు చర్చించకుండా దానిలోని ముఖ్యాంశాన్ని, ముఖ్యమైన విషయాలను ఎక్కువగా చర్చించండి. లేఖనాలను బైబిలు నుండే చదవండి, వాళ్ళు అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రశ్నలు అడగండి. అప్పుడు వాళ్ళు మరిన్ని బైబిలు సత్యాలను స్వంతగా తెలుసుకునేలా సరిగా చదవడం నేర్చుకోవాలని కోరుకుంటారు.

4. మన విద్యార్థి సరిగా చదవడం నేర్చుకునేందుకు మనమెలా సహాయం చేయవచ్చు?

4 చదవడం మెరుగుపర్చుకునే పద్ధతులు: సరిగా చదవలేనివాళ్ళకు లేదా అవకాశం లేక చదువుకోనివాళ్లకు, విషయాన్ని అర్థం చేసుకుని బాగా గుర్తుంచుకునే సామర్థ్యం ఉండవచ్చు. చక్కగా చదివేవాళ్ళు ఎవరైనా చదువుతున్నప్పుడు తమ పుస్తకంలో చూసుకుంటూ జాగ్రత్తగా వినమని, అప్పుడప్పుడూ పదాలను బయటకి పలుకుతూ ఉండమని మీరు చెప్పవచ్చు. అలా చేస్తే వాళ్ళు చక్కగా చదవడం నేర్చుకోగలుగుతారు. కొన్ని ప్రాంతాల్లో పెద్దలు సంఘంలో చదువు నేర్పించేందుకు తరగతులను ఏర్పాటు చేయవచ్చు. ఇలాంటి సలహాలు పాటిస్తూ మనం సరిగా చదవలేనివాళ్ళు రక్షణనిచ్చే జ్ఞానం ఉన్న “పరిశుద్ధలేఖనములను” అర్థం చేసుకునేందుకు సహాయం చేయగలుగుతాం.—2 తిమో. 3:14, 15.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి