‘నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించండి’
1 ఉద్యోగస్థలంలో లేదా స్కూల్లో మీ విశ్వాసాన్ని గురించి మాట్లాడే అవకాశం దొరికినప్పుడు, సాక్ష్యమివ్వడానికి మీరు కొన్నిసార్లు సంకోచిస్తారా? బంధువులకు, పొరుగువారికి లేదా బహుశా మీకు పరిచయంలేని వారికి అనియతంగా సాక్ష్యమివ్వడం మీకు సవాలుగా ఉంటుందా? ‘నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి’ తగిన అవకాశాలను ఉపయోగించుకునేలా మనందరికీ ఏది సహాయం చేస్తుంది?—ఫిలి. 1:14.
2 సంకోచించకండి: అబద్ధారోపణ చేయబడిన దగ్గరి స్నేహితుణ్ణి లేదా బంధువును సమర్థించడానికి మీరు సంకోచిస్తారా? మనకు అత్యంత సన్నిహిత స్నేహితుడైన యెహోవా ఎన్నో శతాబ్దాల నుండి ఎంతో తప్పుగా చిత్రీకరించబడ్డాడు. మన గొప్ప దేవుని గురించి సాక్ష్యమిచ్చే విశేషమైన ఆధిక్యత మనకుంది! (యెష. 43:10-12) దేవునిపట్ల మనకున్న లోతైన ప్రేమ, ఇతరులు మనల్నే గమనిస్తున్నారనే భావనను లేదా భయాన్ని అధిగమించడానికి సహాయం చేస్తూ, సత్యం గురించి సంకోచించకుండా ధైర్యంగా సాక్ష్యమివ్వడానికి మనల్ని పురికొల్పగలదు.—అపొ. 4:26, 29, 31.
3 మనం చెబుతున్నది సువార్త సందేశమని గుర్తుంచుకోండి. దానిని లక్ష్యపెట్టేవారికి అది శాశ్వత ప్రయోజనాలను చేకూరుస్తుంది. దానిని లక్ష్యపెట్టడంవల్ల ప్రజలకు నిరంతర ప్రయోజనాలు చేకూరుతాయి. మన గురించి లేదా మన వ్యతిరేకుల గురించి ఎక్కువగా ఆలోచించే బదులు ప్రకటించే పనికున్న ప్రాముఖ్యత గురించి ఆలోచించడం ధైర్యంతో ప్రకటించడానికి మనకు సహాయం చేస్తుంది.
4 ఇతరుల ఉదాహరణలు: దేవుని వాక్యాన్ని నిర్భయంగా మాట్లాడిన ఇతరుల నమ్మకమైన జీవనవిధానం నుండి మనం ధైర్యాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, హనోకు భక్తిహీన పాపులకు వ్యతిరేకంగా యెహోవా తీర్పును ధైర్యంగా ప్రకటించాడు. (యూదా 14, 15) నోవహు, ఉదాసీనతను చూపించిన ప్రజలకు నమ్మకంగా ప్రకటించాడు. (మత్త. 24:37-39) ‘విద్యలేని పామరులైన’ మొదటి శతాబ్దపు క్రైస్తవులు తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనప్పటికీ ప్రకటనాపనిని కొనసాగించారు. (అపొ. 4:13, 18-20) యెహోవామీద విశ్వాసముంచడం ద్వారా మనుష్యుల భయాన్ని అధిగమించి, ఉత్సాహవంతులైన సువార్తికులుగా మారినవారి ఆధునిక జీవిత కథలు కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో తరచూ వస్తుంటాయి.
5 మనం కష్టకరమైన పరిస్థితులను ఎదుర్కొన్న నమ్మకస్థులైన ప్రాచీనకాల సేవకుల జీవనవిధానాన్ని పరిశీలించడం ద్వారా ధైర్యాన్ని పొందవచ్చు. (1 రాజు. 19:2, 3; మార్కు 14:66-71) వారు ‘దేవునియందు ధైర్యము తెచ్చుకొని’ నిర్భయంగా బోధించారు. మనమూ అలాగే బోధించగలం!—1 థెస్స. 2:2.