పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట మార్చి 15
“ప్రజలు తరచూ యేసుక్రీస్తు రాకడ గురించి మాట్లాడతారు. అది ఎదురుచూడవలసిన సంఘటన అని అనుకుంటున్నారా లేక భయపడాల్సిన విషయమని అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిలు రచయితయైన యోహాను దాని గురించి ఎలా భావించాడో గమనించండి. [ప్రకటన 22:20 చదవండి.] క్రీస్తు రాకడ ఏమి సాధిస్తుందో ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! జన.-మార్చి
“జరుగుతున్న ప్రతీ సంఘటనకూ దేవుడే బాధ్యుడని కొంతమంది భావిస్తారు. ఏదైనా దుర్ఘటన సంభవించినప్పుడు, దాన్ని కలుగజేయడానికి దేవునికి మంచి కారణమే ఉండివుండవచ్చని వారు చెబుతారు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత యాకోబు 1:13 చదవండి.] బాధలకు కారణమేమిటని బైబిలు చెబుతోందో, బాధలను అంతం చేయడానికి దేవుడు ఏమి చేస్తున్నాడో ఈ పత్రిక చూపిస్తుంది.”
కావలికోట ఏప్రి. 1
“మన ఆరోగ్యం, మన కుటుంబం, మన ఉద్యోగం గురించిన ప్రశ్నలను మనం దాదాపు ప్రతీరోజూ ఎదుర్కొంటుంటాము. ఆధారపడదగిన, ఆచరణాత్మక సమాధానాలు మనకు ఎక్కడ దొరుకుతాయని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] 2 తిమోతి 3:16 లో బైబిలు ఏమి చెబుతుందో గమనించండి. [చదవండి.] అనేక ఆచరణాత్మక విధాల్లో బైబిలు మనకెలా సహాయం చేయగలదో ఈ పత్రిక చూపిస్తుంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“ఇది నెరవేరడాన్ని మనం ఎప్పటికైనా చూస్తామని మీరు అనుకుంటున్నారా? [యెషయా 33:24 చదవండి. ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] వైద్యశాస్త్రం ఏమి సాధిస్తోందో, ఈ బైబిలు వాగ్దానం ఎలా నెరవేరుతుందో ఈ పత్రిక వివరిస్తుంది.”