పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట జన. 15
“నమ్మదగిన సలహా కోసం దంపతులు ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] వివాహాన్ని ఎవరు ఆరంభించారో గమనించండి. [ఆదికాండము 2:22 చదవండి.] భార్యాభర్తలు పోషించే గౌరవనీయ పాత్రలకు సంబంధించిన నిర్దేశాలను కూడా దేవుడు ఇచ్చాడు. అవేమిటో ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! జన.-మార్చి
“ప్రతీ సంఘటనకు దేవుడే బాధ్యుడని కొందరు భావిస్తారు. ఏదైనా విషాద సంఘటన జరిగితే, సరైన కారణంతోనే దేవుడు దానిని కలుగజేశాడని వారంటారు. మీ అభిప్రాయమేమిటి? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత యాకోబు 1:13 చదవండి.] బాధలకు కారణమేమిటి, వాటిని అంతం చేయడానికి దేవుడు ఏమి చేస్తున్నాడనే దాని గురించి బైబిలు ఏమి చెబుతోందో ఈ పత్రిక చూపిస్తుంది.”
కావలికోట ఫిబ్ర. 1
“ఈ మాటలను అందరూ పాటిస్తే సమాజం మరింత శ్రేష్ఠంగా ఉంటుందని మీరనుకుంటారా? [ఎఫెసీయులు 4:25 చదివి, ప్రతిస్పందించనివ్వండి.] కొన్ని పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పడం తప్పుకాదని చాలామంది అనుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యం మాట్లాడడంలోని ప్రయోజనాల గురించి ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! జన.-మార్చి
“నేటి నైతిక వాతావరణం దృష్ట్యా ప్రేమికుల మధ్య వివాహానికి ముందు లేక అక్రమ లైంగిక సంబంధం సరైనదేనని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 1 కొరింథీయులు 6:18 చదవి, 18వ పేజీలోని ఆర్టికల్‌ని చూపించండి.] వివాహానికి ముందు లైంగిక సంబంధం కలిగివుండడం గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో ఈ ఆర్టికల్ చర్చిస్తుంది.”