పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోటజన. 15
“ఇటీవలి సంవత్సరాల్లో దేవదూతల విషయంలో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. వారు ఎవరు, మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నారు అనే అంశాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత కీర్తన 34:7 చదవండి.] గతకాలానికి, వర్తమానకాలానికి, భవిష్యత్తుకు సంబంధించిన దేవదూతల కార్యకలాపాల గురించి బైబిలు ఏమి చెబుతుందో ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! జన.-మార్చి
“ప్రకృతి విపత్తులవల్ల కలిగే నష్టాలను చూసినప్పుడు మనకు ఎంతో బాధ కలుగుతుంది. [స్థానికంగా తెలిసిన ఉదాహరణను పేర్కొనండి.] అలాంటి విపత్తులు పెరుగుతున్నాయని మీకు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక ఆ ప్రశ్నను చర్చిస్తుంది. అలాంటి విపత్తుల్లో తమ ప్రియమైనవారిని కోల్పోయినవారికి ఇది ఓదార్పును కూడా అందిస్తోంది.” యోహాను 5:28, 29 చదవండి.
కావలికోటఫిబ్ర. 1
“జీవించడానికి మనందరికీ డబ్బు అవసరం. ఇక్కడ పేర్కొనబడిన అపాయం విషయంలో మనం జాగ్రత్త వహించాలని మీరు అంగీకరిస్తున్నారా? [1 తిమోతి 6:10 చదివి, ప్రతిస్పందించనివ్వండి] ఈ కావలికోట సంచిక, వస్తు సంపదలవల్ల కలిగే కొన్ని సామాన్య అపాయాలను గుర్తించేందుకు మనకు సహాయం చేస్తుంది, అంతేకాక వాటిని ఎలా నివారించాలో కూడా చర్చిస్తోంది.”
తేజరిల్లు! జన.-మార్చి
“ఈ రోజుల్లో ట్రాఫిక్ జామ్ సర్వసాధారణమైపోయింది. మనం దానితో ఎలా వ్యవహరించాలని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత సామెతలు 13:16 చదవండి.] ఈ పత్రికలోని 14వ పేజీలో, మనం జ్ఞానంతో వ్యవహరించడానికి సహాయం చేసే ఆచరించదగ్గ కొన్ని సలహాలున్నాయి.”