కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/06 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2006
km 2/06 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

కావలికోటఫిబ్ర. 15

“ఈ లోకాన్ని పరిపాలించడానికి ఒక వ్యక్తిని మీరు ఎన్నుకోవాల్సివస్తే, ఎవరిని ఎన్నుకుంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ భూమిని పరిపాలించడానికి దేవుడు ఎన్నుకున్న మెస్సీయకు ఉన్న అర్హతల గురించి ఈ కావలికోట సంచిక వివరిస్తుంది. ఆయన పరిపాలన మానవజాతికి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో కూడా అది వివరిస్తోంది.” యెషయా 9:6, 7 చదవండి.

తేజరిల్లు! జన.-మార్చి

“నేడు చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆహారకొరత ఎప్పటికైనా తీరుతుందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత కీర్తన 145:15 చదివి, 12వ పేజీలోని ఆర్టికల్‌ను చూపించండి.] ఈ ఆర్టికల్‌, నేటి ప్రపంచ పరిస్థితినే కాక సృష్టికర్త ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో కూడా వివరిస్తోంది.”

కావలికోటమార్చి 1

“ఈ లేఖనంలో యేసు ఆజ్ఞాపించినట్లు మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలని చాలామంది అంగీకరిస్తారు. [యోహాను 13:34, 35 చదవండి.] తమ జీవితాల్లో యేసు బోధలను అన్వయించుకుంటున్న ప్రజలను మనం ఎక్కడ చూడవచ్చు? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రిక, నేడు నిజ క్రైస్తవులను ఎలా గుర్తించవచ్చో వివరిస్తోంది.”

తేజరిల్లు! జన.-మార్చి

“నేటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, వివాహ ఖర్చులు తలకుమించిన భారమవుతున్నాయి. కొందరు నిరాడంబరమైన వివాహ వేడుక జరపుకోవాలనుకుంటారు, మరికొందరు వివాహ వేడుకలు ఆర్భాటంగా చేయాలని కోరుకుంటారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఒక వ్యక్తికి ఏమి సహాయం చేస్తుంది? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత, రోమీయులు 12:2 చదవండి.] ఈ తేజరిల్లు! సంచికలోని 25వ పేజీ, మీరు జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేసే బైబిలు సూత్రాల గురించి వివరిస్తోంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి