కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/04 పేజీ 1
  • అత్యవసర భావంతో ఉండండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అత్యవసర భావంతో ఉండండి!
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తుంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మీ అత్యవసర భావాన్ని కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ప్రకటించే విషయంలో అత్యవసర భావాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2014
  • అంతం సమీపిస్తుండగా సాక్ష్యమిచ్చే పనిని ఎక్కువగా చేయడం
    మన రాజ్య పరిచర్య—1999
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 11/04 పేజీ 1

అత్యవసర భావంతో ఉండండి!

1 తన తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చేందుకు భూమ్మీద తనకున్న సమయం పరిమితమేనని యేసుకు తెలుసు. (యోహా. 9:4) అందుకే ఆయన తన పరిచర్యను అత్యవసర భావంతో చేశాడు, తన శిష్యులు కూడా అలాగే చేసేలా వారికి శిక్షణ ఇచ్చాడు. (లూకా 4:42-44; 8:1; 10:2-4) ఆయన భౌతిక సుఖాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. (మత్త. 8:20) అందువల్ల యెహోవా తనకు అప్పగించిన పనిని ఆయన పూర్తి చేయగలిగాడు.​—యోహా. 17:4.

2 పరిమిత సమయం: “సకల జనములకు” రాజ్య సువార్త ప్రకటించే సమయం కూడా పరిమితంగానే ఉంది. (మత్త. 24:14) మనం అంత్యదినాల చరమాంకంలో జీవిస్తున్నామని బైబిలు ప్రవచనం బయలుపరుస్తోంది. త్వరలో ‘దేవుని నెరుగనివారు, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారు నిత్యనాశనమను దండన పొందుతారు.’ (2 థెస్స. 1:6-9) ఆ తీర్పు అసాధారణమైన రీతిలో అకస్మాత్తుగా వస్తుంది. (లూకా 21:34, 35; 1 థెస్స. 5:2, 3) ప్రజలు తామున్న అపాయకరమైన పరిస్థితి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇంకా సమయం ఉండగానే యెహోవా అనుగ్రహాన్ని పొందేలా వారికి సహాయం చేసే బాధ్యత మనపై ఉంది.​—జెఫ. 2:2, 3.

3 మనం చేయగలిగినదంతా చేయడం: దేవుని సేవకులు “కాలము సంకుచితమై యున్నది” అని గుర్తించి ప్రకటనా పనికి ప్రాముఖ్యతను ఇస్తారు. (1 కొరిం. 7:29-31; మత్త. 6:33) కొందరు పరిచర్యలో ఎక్కువగా భాగం వహించడం కోసం, ఆర్థికంగా పైకి ఎదిగే అవకాశాలను లేదా ఇతర వ్యక్తిగత వృత్తులను వదులుకున్నారు. (మార్కు 10:29, 30) మరి కొందరు శ్రమలు అనుభవించవలసి వచ్చినా “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తి”తో కొనసాగుతున్నారు. (1 కొరిం. 15:58) చాలామంది కొన్ని దశాబ్దాలుగా నిశ్చలముగా సువార్తను బహిరంగంగా ప్రకటిస్తూనే ఉన్నారు. (హెబ్రీ. 10:23) వారు రాజ్య సంబంధమైన విషయాలకు మద్దతివ్వడానికి చేసిన అలాంటి త్యాగాలన్నింటిని యెహోవా ఎంతో అమూల్యమైనవిగా ఎంచుతాడు.​—హెబ్రీ. 6:10.

4 ప్రకటనా పని కూడా ఒక భాగంగా ఉన్న యెహోవా ఆరాధనను మన జీవితాల్లో ప్రధానమైనదిగా చేసుకోవడం, మనం యెహోవా దినం కోసం కనిపెట్టుకొని ఉండడానికి సహాయం చేస్తుంది. అది సాతాను లోకం వల్ల మన ధ్యాస వేరే విషయాలపైకి మళ్ళకుండా కాపాడుతుంది, పరిశుద్ధ ప్రవర్తనతో ఉండాలనే మన తీర్మానాన్ని బలపరుస్తుంది. (2 పేతు. 3:11-14) నిజానికి, మనం మన పరిచర్యను అత్యవసర భావంతో కొనసాగించడం మన ప్రాణాలనే కాక, మన సమాచారం వినేవారి ప్రాణాలను కూడా రక్షిస్తుంది.​—1 తిమో. 4:16.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి