ప్రకటించే విషయంలో అత్యవసర భావాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?
అత్యవసర భావం దానంతటదే రాదు, దాన్ని పెంపొందించుకోవాలి. ఈ లోకాంతాన్ని తప్పించుకోవాలంటే అది చాలా ప్రాముఖ్యం. కింది జ్ఞాపికలను పాటిస్తే ఎల్లప్పుడూ అత్యవసర భావంతో ఉండగలుగుతాం.
ప్రతీరోజు రాజ్యం గురించి ప్రార్థించండి. —మత్త. 6:9, 10.
రోజూ బైబిలు చదువుతూ మీ హృదయాన్ని కాపాడుకోండి.—హెబ్రీ. 3:12.
మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించండి. —ఎఫె. 5:15, 16; ఫిలి. 1:9-11.
కంటిని “తేటగా” ఉంచుకోండి. లోకాశల వల్ల పక్కదారిపట్టకండి.—మత్త. 6:25; 2 తిమో. 4:10.
బైబిలు ప్రవచనాల నెరవేర్పును గమనిస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి.—మార్కు 13:35-37.
మనకు అత్యవసర భావం ఉంటే, త్వరలో ముగియనున్న ఈ పనిలో పూర్తిగా పాల్గొంటాం.—యోహా. 4:34, 35.