కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/04 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 10/04 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“పిల్లలను స్వార్థపూరితంగా ఉపయోగించుకోవడం గురించి విన్నప్పుడు మనమందరం చాలా బాధపడతాం. ‘దేవునికి నిజంగా శ్రద్ధ ఉందా?’ అని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఏమంటారు? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత కీర్తన 72:12-14 చదవండి.] పిల్లల గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడు, కష్టాలు అనుభవిస్తున్న వారందరికి ఆయనెలా శాశ్వత విముక్తిని తీసుకొస్తాడు అనే విషయాలను ఈ ఆర్టికల్‌ చర్చిస్తుంది.”

కావలికోట అక్టో. 15

“తమ దగ్గర ఎంత డబ్బుంటే జీవితం అంత సంతృప్తికరంగా ఉంటుందని కొందరు నమ్ముతారు. అది నిజమని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] కోట్లకు పడగెత్తిన ఒక వ్యక్తి ఏమి వ్రాశాడో చూడండి. [ప్రసంగి 5:⁠10 చదవండి.] భౌతిక సంపత్తికంటే మరెంతో విలువైన వాటి గురించి ఈ పత్రిక చర్చిస్తోంది.”

తేజరిల్లు! అక్టో.-డిసెం.

“ప్రత్యేకించి ఇతర దేశాలకు చెందిన యౌవనుల్లో లైంగిక దుర్నీతి పెరిగిపోవడం గురించి విన్నప్పుడు మనం కలత చెందుతాం. ఇక్కడ కూడా అలాగే జరుగుతోందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ విషయమై దేవుని సలహా ఏమిటో గమనించండి. [1 థెస్సలొనీకయులు 4:3-5 చదవండి.] ఈ పత్రిక లైంగిక దుర్నీతిలో ఉండే ప్రమాదాలను వివరిస్తూ వాటికి దూరంగా ఉండడానికి ఆశానిగ్రహం ఎలా సహాయం చేస్తుందో తెలియజేస్తుంది.”

కావలికోట నవం. 1

“నేటి సమస్యలను పరిష్కరించడంలో మానవ నాయకులకున్న సామర్థ్యంపై చాలామందికి నమ్మకం లేదు. ఈ వచనాల్లో ప్రవచింపబడిన వాటిని ఎవరైనా నెరవేర్చగలరని మీరనుకుంటున్నారా? [కీర్తన 72:7, 12, 16 చదవండి, ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] ఇక్కడ ముందుగా చెప్పబడిన నాయకుడు ఎవరు, ఆయన ఏమి నెరవేరుస్తాడు అనే విషయాలను ఈ పత్రిక వివరిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి