కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/04 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 4/04 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“మన పిల్లలు ఆనందకరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపాలని మనమందరం కోరుకుంటాం. నేటి లోకంలోని ఒత్తిళ్లను తట్టుకోవాలంటే పిల్లలకు ఎక్కువగా ఏమి అవసరమని మీరు భావిస్తున్నారు? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత సామెతలు 22:6 చదవండి.] తేజరిల్లు! యొక్క ఈ సంచిక పిల్లలకు ఏమి అవసరం, వాటిని తల్లిదండ్రులు ఎలా తీరుస్తారు అనే విషయాలను చర్చిస్తుంది.”

కావలికోట ఏప్రి. 15

“తమ జీవితంలో సంభవించే విషాద ఘటనలతోపాటు అన్ని సంఘటనలు దేవుని చిత్త ప్రకారమే జరుగుతాయని కొంతమంది భావిస్తారు. మీరు ఆ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ ప్రార్థన గురించి చాలామందికి తెలుసు. [మత్తయి 6:⁠10బి చదవండి.] ఈ భూమిపట్ల దేవుని చిత్తం ఏమిటి, అదెప్పుడు నెరవేరుతుంది? అనే ప్రశ్నలకు ఈ పత్రిక బైబిలు నుండి జవాబులను ఇస్తుంది.”

తేజరిల్లు! ఏప్రి.-జూన్‌

“అనేకమంది దౌత్య ప్రయత్నాల ద్వారా ప్రపంచ శాంతిని సాధించవచ్చని నమ్ముతారు. అలాంటప్పుడు శాంతి చర్చలు తరచూ పరిమిత విజయాన్నే ఎందుకు సాధిస్తున్నాయి? [ప్రతిస్పందించనివ్వండి.] అలాంటి దౌత్య ప్రయత్నాలు తరచూ విఫలమవడానికి గల నిజమైన కారణాలను ఈ పత్రిక పరిశీలిస్తుంది. ఇది బైబిలు వాగ్దానం చేస్తున్న లోకం గురించి కూడా వివరిస్తుంది, ఆ లోకంలో నిజమైన శాంతి గురించిన మన కోరిక నిజమవుతుంది, ఆ శాంతి నిరంతరం ఉంటుంది! కీర్తన 37:11, 29 చదవండి.”

కావలికోట మే 1

“మానవ సమాజాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో కొందరు మతనాయకులు రాజకీయాల్లో పాల్గొన్నారు. కానీ, యేసును రాజుగా చేయాలని ప్రజలు కోరుకున్నప్పుడు ఆయనేమి చేశాడో గమనించండి. [యోహాను 6:15 చదవండి.] యేసు ఇతరులకు శాశ్వతంగా మంచిని చేకూర్చేదానిపైనే దృష్టి సారించాడు. అదేమిటో ఈ పత్రిక చర్చిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి