రక్తం తీసుకోకుండా ఉండడానికి మనకు సహాయంచేసే ఏర్పాట్లు
ఇంతకుముందే తేదీ ముద్రించని లేదా 3/99 అనే తేదీ ముద్రించివున్న అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డు లేదా గుర్తింపు కార్డు నింపిన బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులు ఈ సంవత్సరం కొత్తది నింపాల్సిన అవసరం లేదు. డిసెంబరు 29తో ఆరంభమయ్యే వారపు సేవాకూటానికి సంఘ కార్యదర్శి కొత్తగా బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులకు, వారి పిల్లలకు, తిరిగి కొత్తవి తీసుకోవలసిన వారికి సరిపడా కార్డులు అందుబాటులో ఉండేలా చూడాలి. ఆగస్టులో సంవత్సరానికి సరిపడా పంపించే ఫారమ్లతోపాటు ఈ కార్డులు తగినన్ని అన్ని సంఘాలకు పంపించబడతాయి. సరిపడా కార్డులు సంఘానికి అందుబాటులో లేకపోతే సంఘ కార్యదర్శి సమీప సంఘాల్లో అవి లభిస్తాయేమో చూడాలి లేదా ఆ తర్వాత సంఘం తరఫున పంపే లిటరేచర్ రిక్వెస్టులో మరిన్ని కార్డులకోసం అడగాలి.
కార్డులు ఇంటి దగ్గరే జాగ్రత్తగా నింపాలి కాని సంతకం చేయకూడదు. తర్వాతి సంఘ పుస్తక అధ్యయనమప్పుడు, అవసరమైతే పుస్తక అధ్యయన పైవిచారణకర్త సహాయంతో, కార్డులపై సంతకంచేసి, సాక్షుల సంతకాలు తీసుకొని, తేదీవేయాలి. కార్డు యజమాని సంతకం చేయడం సాక్షులు చూడాలి.
బాప్తిస్మం తీసుకోని ప్రచారకులు తమకోసం, తమ పిల్లలకోసం అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డులో, గుర్తింపు కార్డులో ఉన్న మాటలనే ఉపయోగిస్తూ తామే సొంతగా నిర్దేశక పత్రాలు వ్రాసుకోవచ్చు.