మన క్రైస్తవ జీవితం
JW.ORG కాంటాక్ట్ కార్డులను బాగా వాడుతున్నారా?
మహాశ్రమలు దగ్గర్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన ప్రకటనా పని అత్యవసరం. (సామె 24:11, 12, 20) ప్రజలకు సహాయం చేయడానికి మనం కాంటాక్ట్ కార్డులు ఉపయోగించి వాళ్లను దేవుని వాక్యం వైపు, మన వెబ్‌సైట్ వైపు నడిపించవచ్చు. ఈ కార్డులో ఉండే కోడ్ బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియోకి తీసుకెళ్తుంది. ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి, బైబిలు స్టడీకి సంబంధించిన రిక్వెస్టుకి కూడా నడిపిస్తుంది. కొంతమందికి మన పుస్తకాలు తీసుకోవడం ఇష్టం ఉండదు కానీ మన వెబ్‌సైట్ చూడడం ఇష్టం ఉండవచ్చు. అలాంటి వాళ్లకు మన కాంటాక్ట్ కార్డు ఇవ్వడానికి వెనకాడకండి. కానీ కాంటాక్ట్ కార్డులను ఆసక్తి లేని వాళ్లకు ఇవ్వకండి.
మీరు ప్రతీ రోజు మీ పనులు మీద తిరుగుతున్నప్పుడు, మిమ్మల్ని కలిసే వాళ్లలో ఆసక్తిని కలిగించడానికి ఇలా చెప్పవచ్చు: “నేను మీకు ఒక వెబ్‌సైట్ గురించిన కార్డు ఇవ్వాలనుకుంటున్నాను. దాని ద్వారా మీరు ఉచితంగా ఎన్నో విషయాలకు సంబంధించిన సమాచారాన్ని, వీడియోలను చూడొచ్చు.” (యోహా 4:7) కాంటాక్ట్ కార్డు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి, కొన్ని కార్డుల్ని ఎప్పుడూ మీ దగ్గర పెట్టుకుంటే ఎవరైనా కలిసినప్పుడు వాళ్లకు ఇవ్వవచ్చు.