ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాలను ఉపయోగించవచ్చు. జనవరిలో: 1988కి ముందు ప్రచురించబడిన పుస్తకాలేవైనా సంఘం స్టాకులో ఉంటే అవి. ఒకవేళ అవేవీ మీ దగ్గర స్టాకులో లేకపోతే దగ్గర్లో ఉన్న ఏ సంఘంలోనైనా పాత ప్రచురణల అదనపు స్టాకు ఉందేమో చూసి వాటిని ఉపయోగించవచ్చు. పాత పుస్తకాలు లేని సంఘాలు కుటుంబ సంతోషానికిగల రహస్యము లేదా యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి. ఈ పుస్తకం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా, జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) లేదా ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకాలను ఉపయోగించవచ్చు. మార్చిలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలు ఆరంభించేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయాలి. ప్రజల దగ్గర ఇప్పటికే ఆ పుస్తకం ఉంటే, దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) ప్రతిపాదించవచ్చు.
◼ ప్రపంచవ్యాప్త పని కోసం, రాజ్యమందిర నిధి కోసం కేటాయించిన పెట్టెల్లో వేయబడిన విరాళాలను ప్రతీనెల పంపించాలి. వాటిని రాజ్యమందిర స్థిరాస్తి రుణం చెల్లించడానికో లేదా ఇతరత్రా సంఘపు ఖర్చులకో ఉపయోగించకూడదని సంఘ అక్కౌంట్స్ చూసే సహోదరులకు గుర్తుచేయబడుతోంది.
◼ 2005వ సంవత్సరంలో జ్ఞాపకార్థదినపు ఆచరణ మార్చి 24, గురువారం సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. రాజ్యమందిరాన్ని, ఇతర సదుపాయాలను చాలా సంఘాలు కలిసి ఉపయోగిస్తుంటే సహోదరులు అందుబాటులో ఉన్న హాళ్లకు అవసరమైన రిజర్వేషను లేదా కాంట్రాక్టు కుదుర్చుకోవడానికే ఇంత ముందుగా ఆ తేదీ తెలియజేయబడుతోంది. అలాంటి సందర్భాల్లో జ్ఞాపకార్థ ఆచరణ క్రమబద్ధంగా, ప్రశాంతంగా జరగడానికి వీలయ్యేలా ఆ వసతిలోని ఇతర కార్యకలాపాల వల్ల భంగం వాటిల్లకుండా ఉండేలా పెద్దలు హాలు యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవాలి. ఆ సందర్భపు ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, జ్ఞాపకార్థదిన ప్రసంగీకునిగా పెద్దలసభ కేవలం వంతులవారీగా లేదా ప్రతి సంవత్సరం అదే సహోదరుణ్ని ఉపయోగించకుండా మరింత యోగ్యులైన పెద్దలలో ఒకరిని ఎంపికచేసుకోవాలి. ప్రసంగం ఇవ్వగల, అభిషిక్తుడైన పెద్ద ఉంటే ఆయననే ఎంపికచేసుకోవాలి.
◼ లేఖనముల నుండి తర్కించడం ఆంగ్లం, మలయాళం, తమిళ భాషల్లోనే అందుబాటులో ఉంది కాబట్టి, ఈ సాహిత్యం ఉపయోగించడానికి వీలున్న సంఘాలన్నీ తమ “2004వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో” దానినే ఉపయోగించవలసిందిగా ప్రోత్సహించబడుతున్నారు. తమ భాషల్లో లేఖనముల నుండి తర్కించడం పుస్తకాన్ని ఉపయోగించలేని సంఘాలు “2004వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో” బైబిలు చర్చాంశాలు [td] ఉపయోగించాలని ప్రోత్సహించబడుతున్నారు. వారి ప్రయోజనార్థం ఓ అనుబంధం మనరాజ్య పరిచర్య యొక్క ఈ సంచికలో ఇవ్వబడింది. “2004వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో” తమ సంఘాలు ఈ రెండు సాహిత్యాల్లో ఏది ఉపయోగించాలనేది స్థానిక సంఘాల పెద్దల సభలు నిర్ణయించుకోవాలి.
◼ 2004 మార్చి 15 నుండి 2005 మే 16 వరకు యెహోవాకు సన్నిహితమవండి సంఘ అధ్యయన పుస్తకంగా ఉపయోగించబడుతుంది.
◼ మళ్లీ లభ్యమయ్యే ప్రచురణలు:
కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (కరపత్రం నెం. 21)—పంజాబీ