ప్రాముఖ్యమైన ఓ వైద్య విధానాన్ని నొక్కితెలిపే వీడియో
రోగుల నైతిక దృక్కోణాలకూ, హక్కులకూ న్యాయ, ఆరోగ్య వృత్తుల్లో ఉన్నవారు అధిక శ్రద్ధనిస్తున్నారు. ఇది కొత్త వైద్య విధానాలను, పద్ధతులను ప్రోత్సహిస్తోంది, వీటినుండి యెహోవాసాక్షులు ప్రయోజనం పొందవచ్చు. (అపొ. 15:28, 29) మార్పిడికి—ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణ—రోగి అవసరాలు, హక్కులు తీర్చడం (ఆంగ్లం) అనే వీడియో ముఖ్య ఉద్దేశం అదే. ఆ వీడియోను చూసి మీరేమి తెలుసుకున్నారో పునఃసమీక్షించుకోండి. గమనిక: ఆ వీడియోలో సర్జరీకి సంబంధించిన చిన్నచిన్న దృశ్యాలు ఉన్నాయి కాబట్టి తమ చిన్నపిల్లలతోపాటు ఆ వీడియో చూసే విషయంలో తలిదండ్రులు తమ వివేచన ఉపయోగించాలి.
(1) రక్తమార్పిడుల గురించి వైద్య సమాజమెందుకు పునరాలోచిస్తోంది? (2) రక్తమార్పిడి లేకుండా చేసిన సంశ్లిష్ట సర్జరీల మూడు ఉదాహరణలు చెప్పండి. (3) ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వైద్యులు, సర్జన్లు రక్తమార్పిడి లేకుండానే రోగులకు వైద్యం చేస్తామనే తమ ఇష్టతను వెలిబుచ్చారు? అలాచేయడానికి వారెందుకు సుముఖంగా ఉన్నారు? (4) రక్తం వాడకాన్ని గురించి ఇటీవలి ఆస్పత్రి అధ్యయనాలు ఏమి వెల్లడించాయి? (5) రక్తమార్పిడులతో ఎలాంటి వైద్య ప్రమాదాలు ముడిపడి ఉన్నాయి? (6) మార్పిడి ప్రత్యామ్నాయాల ప్రయోజనాల గురించి అనేకమంది నిపుణులు ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? (7) రక్తహీనత కలగడానికి కారణమేమిటి? మానవులు ఏ స్థాయివరకు రక్తహీనత తట్టుకోగలరు? దానిని పూరించడానికి ఏమి చేయవచ్చు? (8) రోగి శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తిని ఎలా ఉత్తేజపరచవచ్చు? (9) సర్జరీచేసే సమయంలో రక్తం నష్టపోవడాన్ని తగ్గించేందుకు ఎలాంటి సాంకేతిక పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి? (10) మార్పిడి ప్రత్యామ్నాయాలు చిన్నపిల్లలకు లేదా ప్రాణాపాయ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సమర్థవంతంగా పనిచేస్తాయా? (11) మంచి వైద్య శ్రద్ధచూపే నైతిక సూత్రాల్లో ఒక నైతిక సూత్రమేమిటి? (12) క్రైస్తవులు రక్తరహిత చికిత్సను ముందే ఎంపిక చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? దీనిని మనమెలా చేయవచ్చు?
వీడియోలో చూపబడిన కొన్ని చికిత్సా పద్ధతులను అంగీకరించడం, ప్రతి వ్యక్తి బైబిలు శిక్షణపొందిన తన మనస్సాక్షి ప్రకారం వ్యక్తిగతంగా తీసుకోవలసిన నిర్ణయం. మీకు మీ పిల్లలకు ఏ మార్పిడి ప్రత్యామ్నాయాలను అంగీకరించడానికి మీరు ఇష్టపడుతున్నారో నిర్ణయించుకున్నారా? సాక్షులుకాని కుటుంబ సభ్యులకు సైతం మీ నిర్ణయాల గురించి, వాటికి కారణాల గురించి పూర్తిగా వివరించాలి.—జూన్ 15, అక్టోబరు 15, 2000 కావలికోట సంచికల్లోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.