2004 కోసం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
1 విశ్వ ప్రాముఖ్యతగల పనిని నెరవేర్చడానికి, యెహోవా సాధారణ ప్రజలను సన్నద్ధం చేస్తున్నాడు. దీనికి ఆయన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ద్వారా ప్రతీవారం శిక్షణ ఇవ్వడాన్ని ఒక మార్గంగా ఉపయోగిస్తున్నాడు. మీ పరిస్థితులు అనుమతించినంత మేరకు మీరు దీనిలో పూర్తిగా పాల్గొంటున్నారా? ఈ ఏర్పాట్ల నుండి విద్యార్థులు అత్యధిక ప్రయోజనం పొందేలా సహాయం చేయడానికి జనవరి నుండి కొన్ని సవరణలు అమల్లోకి వస్తాయి.
2 సహాయ సలహాదారుల రొటేషన్: ఉపదేశ ప్రసంగాలు, బైబిలు ఉన్నతాంశాలు నిర్వహించే సహోదరులు సహాయ సలహాదారుని అభిప్రాయ వ్యాఖ్యలకు కృతజ్ఞత చూపారు. యోగ్యులైన పెద్దలు సరిపడేంత మంది ఉన్న సంఘాల్లో సహాయ సలహాదారుని నియామకాన్ని ప్రతీ సంవత్సరం రొటేట్ చేయవచ్చు. ఈ విధంగా, పని భారం పంచుకోవచ్చు; అంతకంటే ప్రాముఖ్యంగా, వివిధరకాల సమర్థ ప్రసంగీకుల, బోధకుల సమిష్టి అనుభవం నుండి పెద్దలు, అర్హులైన పరిచర్య సేవకులు ప్రయోజనం పొందుతారు.
3 మౌఖిక పునఃసమీక్షకు పట్టిక వేసుకోవడం: మౌఖిక పునఃసమీక్షా వారంలో మీ సంఘానికి ఒకవేళ ప్రాంతీయ సమావేశం ఉంటే, పునఃసమీక్షను (ఆ వారపు మిగిలిన నియామకాలను) మరుసటి వారానికి వాయిదావేసి, తర్వాతి వారపు నియామకాలను ఒక వారం ముందుకు జరుపుకోవాలి. అయితే మౌఖిక పునఃసమీక్ష, ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం ఒకేసారివస్తే పూర్తిగా రెండు వారాల నియామకాలను మార్పిడి చేయవలసిన అవసరం లేదు. బదులుగా ఆ వారపు పట్టిక ప్రకారమే పాట, ప్రసంగ లక్షణం, బైబిలు ఉన్నతాంశాలు నిర్వహించాలి. అయితే (ప్రసంగ లక్షణపు ప్రసంగం తర్వాత ఇవ్వబడే) ఉపదేశ ప్రసంగం మాత్రం తర్వాతి వారపు పట్టికలో నుండి తీసుకోవాలి. బైబిలు ఉన్నతాంశాల తర్వాత, అరగంటపాటు సేవా కూటం ఉంటుంది, దానిని మూడు 10 నిమిషాల భాగాలుగా లేదా రెండు 15 నిమిషాల భాగాలుగా సవరించుకోవచ్చు. (ఆరంభంలో ప్రకటనలు చేయనక్కరలేదు.) సేవకూటం తర్వాత పాట, అరగంటపాటు ప్రాంతీయ పైవిచారణకర్త నిర్వహించే కార్యక్రమం ఉంటాయి. ఆ తర్వాతి వారం దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పట్టిక ప్రకారమే ప్రసంగ లక్షణపు ప్రసంగం, బైబిలు ఉన్నతాంశాలు ఆ పిమ్మట మౌఖిక పునఃసమీక్ష ఉంటాయి.
4 ఆధ్యాత్మిక పురోగతికై లభించే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్యనుండి మీరు ప్రయోజనం పొందుతుండగా, మీరు మీ సంఘాన్ని ప్రోత్సహిస్తూ బైబిలు ప్రవచన నెరవేర్పులో ఒక పాత్ర పోషిస్తూ మనం ప్రకటించవలసిన అద్భుత సందేశపు మూలకర్తకు స్తుతులు తీసుకువస్తారు.—యెష. 32:3, 4; ప్రక. 9:19.