పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“మన పిల్లలను మలిచే విషయంలో, అర్హతగల ఉపాధ్యాయులు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తారు అని మీరు తప్పకుండా అంగీకరిస్తారు. మన పాఠశాలల్లో బోధించబడే పద్ధతి యొక్క నాణ్యతను మెరుగుపర్చవలసిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? [సామెతలు 2:10, 11 చదవండి.] ఉపాధ్యాయులు నిర్వహించే ప్రధానమైన పాత్రను, వారికున్న ఈ కష్టమైన సవాలు విషయంలో వారికి సహాయపడడానికి తల్లిదండ్రులు ఏమి చేయగలరు అన్నదానిని తేజరిల్లు! ఉన్నతపరుస్తుంది.”
కావలికోట మే 15
“దేవుని గురించి తెలుసుకోవడం సాధ్యమే అని మీరు అనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] ఒక వ్యక్తి గురించి మనకు అంతగా తెలియనప్పుడు ఆ వ్యక్తిని నమ్మడం కష్టమని మీరు అంగీకరిస్తారు. నిజానికి, బైబిలు దేవుని వెదకమని మనల్ని ప్రోత్సహిస్తుంది. [అపొస్తలుల కార్యములు 17:26, 27 చదవండి.] దేవుని గురించి మనం ఇంకా ఎక్కువగా ఎలా తెలుసుకోగలమో ఈ ఆర్టికల్‌లు మనకు చూపిస్తాయి.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“కొన్నిసార్లు, అపరాధ భావాలు ఒక వ్యక్తి తన పరిస్థితి ఆశారహితమైనదని భావించడానికి నడిపించగలవు. ఇలాంటి భావాలు మనకు ఏమైనా మంచి చేయగలవని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించిన తర్వాత, కీర్తనలు 32:3, 5 చదవండి.] ఈ భావాలు మనం అనుకూలమైన చర్య తీసుకునేలా మనల్ని ఎలా కదిలించగలవో తేజరిల్లు! యొక్క ఈ సంచిక తెలియజేస్తుంది.”
కావలికోట జూన్ 1
“ఇటీవల జరిగిన సంఘటనలు, అమాయకులు అకాల మరణానికి ఎందుకు గురౌతున్నారు అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ప్రజలు ఎందుకు చనిపోతారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [జవాబు చెప్పనివ్వండి, తర్వాత 7వ పేజీలోని చార్ట్‌కు తిప్పండి.] సర్వసాధారణమైన ఈ కల్పిత కథలలో ఒకదాని గురించి బైబిలు ఏమి చెబుతుందో చూడడానికి మీరు ఇష్టపడతారా?” వీలైతే, ఉల్లేఖించబడిన ఒక లేఖనాన్ని చదవండి.