మీ సంఘానికి విస్తారమైన సేవా ప్రాంతం ఉందా?
1 యేసు, యూదయలోని నగరాలనుంచి గలిలయలోని గ్రామీణ ప్రాంతాలవరకు, ప్రాచీన ఇశ్రాయేలులోవున్న విస్తారమైన సేవా ప్రాంతమంతటా సంపూర్ణంగా సాక్ష్యమిచ్చాడు. (మార్కు 1:38, 39; లూకా 23:5) మనము కూడా సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలకు సువార్త ప్రకటించాలి. (మార్కు 13:10) అయితే, ఇండియా క్షేత్రంలో కేవలం కొంత భాగం మాత్రమే సంఘాలకు నియమించబడింది, అలా నియమించబడిన సేవా ప్రాంతాలు కూడా క్రమబద్ధంగా సంపూర్ణంగా పూర్తిచేయవలసిన అవసరం ఉందని నివేదికలు చూపిస్తున్నాయి.
2 ఎక్కువమంది ప్రజలను చేరుకోవడానికి మనం ఏమి చేయగలం?
3 జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి: సంఘానికి సంబంధించిన సేవా ప్రాంతమంతా మ్యాప్‌లుగా విభాగించబడేటట్టు, ప్రతి మ్యాప్‌లో 200 నుంచి 300 కంటే ఎక్కువ గృహాలు ఉండకుండా ఉండేటట్టు సేవా పైవిచారణకర్త మరియు సేవా ప్రాంత సేవకుడు నిశ్చయపర్చుకోవాలి. అంతేకాకుండా, ఒక సంవత్సరంలో సంపూర్ణంగా పూర్తిచేయగలదాని కంటే ఎక్కువ సేవా ప్రాంతం తమ దగ్గర ఉండకుండా వారు చూసుకోవచ్చు. కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాలలో, సాక్ష్యమివ్వడానికి మనం చేసే కృషిని విడువక వ్యతిరేకించే వితండవాదులున్నారని వారికి తెలిస్తే, బహుశా ఈ ప్రాంతాలకు బదులు, వినడానికి ఇష్టపడే నివాసులున్న అనియమిత సేవా ప్రాంతాన్ని తీసుకోవచ్చు. (లూకా 9:5, 6 పోల్చండి.) అయితే వారు వివేచనను ఉపయోగించాలి, ఎందుకంటే కొన్నిసార్లు ఒక ప్రాంతంలో కేవలం ఒక్క వ్యక్తే వ్యతిరేకించవచ్చు, అతని ఇంటిని లేక అతనుంటున్న వీధిని “సందర్శించవద్దు” అని మ్యాప్ మీద వ్రాసి పెట్టుకోవచ్చు, మిగతా ప్రాంతం అంతా కూడా జాగ్రత్తగా ఏ సమస్యా లేకుండా పూర్తిచేయవచ్చు.
4 ఇంటింటి పరిచర్యకు ఎక్కువ సమయాన్ని వెచ్చించమని సంఘమంతటినీ ప్రోత్సహించవచ్చు. మనం సిద్ధపడి, క్షేత్ర సేవా కూటానికి హాజరవ్వడానికి తరచూ చాలా సమయం వెచ్చిస్తాము. ఇంతా కష్టపడి, మనం మన పొరుగువారిని సందర్శించడంలో కేవలం ఒక గంట లేక అంతకంటే తక్కువ సమయం మాత్రమే గడపడం ఎంత విచారకరం. మనం బైబిలు అధ్యయనాలు, పునర్దర్శనాలు చేయవలసి ఉండవచ్చు, కానీ మనకు నియమించబడిన సేవా ప్రాంతంలో రెండు లేక మూడు గంటలు పనిచేసిన తర్వాత పునర్దర్శనాలకూ బైబిలు అధ్యయనాలకు వెళ్ళలేమా? కొన్ని మురికివాడలలో మరియు ఎక్కువ జనాభాగల కాలనీలలో వేలాదిమంది ప్రజలు తమ ఇళ్ళలోనో, ఇంటి చుట్టుప్రక్కలో ఉంటారు. ఇలాంటి ప్రాంతాలు సురక్షితం అయితే, మనం ఒక్కళ్ళమే పనిచేయడం ప్రయోజనకరంగా ఉండదా? ఇలాంటి ప్రాంతాలలో మన తోటి సాక్షులకు కనిపించేటట్టు ఉండడం సులభం, అదే సమయంలో వేర్వేరుగా పనిచేయడం వల్ల మనం రెండింతలు ఎక్కువ సేవా ప్రాంతాన్ని పూర్తిచేయగల్గుతాము మరియు ప్రతి ఇంటిలోను వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వగల్గుతాము.
5 మంచిగా ప్రణాళిక వేసుకుంటే మన దగ్గర సరిగ్గా అవసరమయ్యే భాషలో సాహిత్యం కూడా ఉంటుంది. బహుశా ప్రధాన పట్టణాలలో, ఆ ప్రాంతంలో అవసరమయ్యే భాషలను ప్రతి మ్యాప్ కార్డ్ మీద వ్రాసి పెట్టడం అవసరం కావచ్చు, అలాగైతే పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు తమ గుంపులు చక్కగా సిద్ధపడి ఉండేలా నిశ్చయపర్చుకోగలుగుతారు.
6 సంపూర్ణంగా సహకరించండి: విస్తారమైన సేవా ప్రాంతంలో పనిచేయడానికి సంఘంలోని ప్రతి ఒక్కరి సహకారం అవసరం. మాట్లాడడానికి సుముఖంగా ఉన్న గృహస్థులను మీరు కలిసినప్పుడు మంచి వివేచనను ఉపయోగించాలి. క్షేత్రంలో ప్రతి ఒక్కరిని చేరుకోవలసిన అవసరం ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, అలాగే క్షేత్ర సేవా గుంపులో మీ కోసం వేచివున్న ఇతరుల గురించి కూడా ఆలోచించండి. ఆసక్తిగల వ్యక్తితో కాస్త ఎక్కువ సేపు సంభాషించాలని మీరు ఇష్టపడితే, మిగతా గుంపంతా కూడా క్షేత్ర సేవను కొనసాగించగలిగేలా ఏర్పాట్లు చేయవచ్చా?
7 ఆసక్తి చూపించిన వారందరిని మళ్ళీ సందర్శించడానికి నిర్దిష్టమైన ఏర్పాట్లు చేసుకోండి. చిరునామాతోపాటు, ఆసక్తిగల వ్యక్తి ఫోన్ నెంబరు తీసుకోవడానికి ప్రయత్నించండి, అలా చేస్తే మీరు అతన్ని టెలిఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మరింత సాక్ష్యమివ్వవచ్చు. రోడ్లకు పేర్లు, ఇళ్ళకు నంబర్లు లేకపోతే, ఆసక్తిగల వ్యక్తిని పునర్దర్శించడానికి సహాయపడే విధంగా జాగ్రత్తగా మ్యాప్ గీసి పెట్టుకోండి లేక వివరణ వ్రాసిపెట్టుకోండి.
8 “మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణ” చేయమని యేసు ఇచ్చిన ఆదేశాలను పాఠించడం మనకెంతటి ఆధిక్యతో కదా! (మత్త. 10:11) అత్యంత ప్రతిఫలదాయకమైన ఈ పనిలో భాగం వహించడానికి మీరు ఇష్టపూర్వకంగా చేసే కృషిని యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడు!