పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! ఏప్రిల్-జూన్
“బైబిలు మంచి విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. [సామెతలు 2:10, 11 చదవండి.] పిల్లలకు బోధించడానికి అర్హతగల ఉపాధ్యాయులు ఎంత అవసరమో దాదాపు మనందరికి తెలుసు. ఉపాధ్యాయులు నిర్వహించే ప్రధానమైన పాత్రను, మనము వారి త్యాగాల విషయంలో మెప్పుదల ఎలా చూపించాలో మరియు వారికున్న ఈ కష్టమైన సవాలు విషయంలో వారికి సహాయపడడానికి తల్లిదండ్రులు ఏమి చేయగలరో తేజరిల్లు! ఉన్నతపరుస్తుంది.”
కావలికోట ఏప్రిల్ 15
“ప్రజలు ఎక్కడ జీవిస్తున్నప్పటికీ, భద్రత కలిగి ఉండాలని, అంటే సంతృప్తికరమైన ఉద్యోగం సంపాదించుకొని, ఆ ఉద్యోగంలోనే కొనసాగాలని ఆశిస్తారు. కానీ, మీరు నిరంతరం భద్రత కలిగివుండడానికి దోహదపడే శాశ్వతమైన భద్రతకు మూలం ఉందా అని మీరెప్పుడైనా ఆలోచించారా? [కీర్తన 16:8, 9 చదవండి.] నిజమైన భద్రత ఎక్కడ లభిస్తుందో కావలికోట యొక్క ఈ సంచిక చర్చిస్తుంది.”
తేజరిల్లు! ఏప్రిల్-జూన్
“తప్పు చేసిన తర్వాత మనందరము అపరాధ భావాలను అనుభవిస్తాము. ఇది మనకు మంచిదేనని మీరు అనుకుంటారా? [జవాబు చెప్పిన తర్వాత, కీర్తన 32:3, 7 చదవండి.] ఇలాంటి భావాలు మనము అనుకూలమైన చర్య తీసుకోవడానికి మనల్ని ఎలా ప్రేరేపించగలవో తేజరిల్లు! యొక్క ఈ సంచిక తెలియజేస్తుంది.”
కావలికోట మే 1
“తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న లేదా అశక్తతతో బాధపడుతున్న వారు ఎవరైనా మీకు తెలుసా? అలాంటివారికి ప్రోత్సాహం అవసరమని మీరు నిస్సందేహంగా అంగీకరిస్తారు. కానీ వారిని ప్రోత్సహించడానికి మనం ఏమి చెప్పవచ్చు? బైబిలు నిరీక్షణా వచనాలనిస్తుంది. [యెషయా 35:5, 6 చదవండి.] ఈ ప్రవచనం నిజమౌతుందని మనం ఎందుకు నిశ్చయతతో ఉండవచ్చో కావలికోట యొక్క ఈ సంచిక వివరిస్తుంది.”