బైబిలు—మీ జీవితంపై దాని ప్రభావము అనే వీడియో మన మనస్సులపై వేసిన ముద్రలు
ఈ క్రింది ప్రశ్నలకు జవాబుగా, వీడియోలో ఉన్నటువంటి సందేశంపై మీ హృదయపూర్వక అభిప్రాయాలను తెలియజేయండి. (1ఎ) లక్షలాది మంది తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఏది శక్తినిచ్చింది? (హెబ్రీ. 4:12) (1బి) ఒక వ్యక్తి ఆ శక్తిని పొందాలంటే, అది తన జీవితంలో పని చేయాలంటే ఏమి అవసరము? (2) భార్యాభర్తలు (ఎ) విషయాలను గురించి అరమరికలు లేకుండా ఒకరికొకరు తెలుపుకునేలా తమ సంభాషణా తీరును మెరుగు పరచుకోవడానికీ (బి) తమ కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికీ సహాయపడేందుకు ఏ బైబిలు లేఖనాలు పేర్కొనబడ్డాయి? (3) వివాహ జీవితాన్ని గురించిన క్రైస్తవ దృక్కోణం కుటుంబ జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది? (ఎఫె. 5:28, 29) (4) పిల్లలందరూ కావాలనుకునేవీ, వారికవసరమైనవీ అయిన మూడింటిని ఇవ్వడంలో యెహోవా ఎలా ఒక చక్కని మాదిరిని ఉంచాడు, నేడు తల్లిదండ్రులు కూడా అదేమాదిరిగా ఎలా చేయవచ్చు? (మార్కు 1:9-11) (5) తమ పిల్లలకు బైబిలును స్వయంగా తల్లిదండ్రులే ఎందుకు నేర్పించాలి, అలా క్రమంగా నేర్పించాల్సిన అవసరముందని ఏది సూచిస్తుంది? (ద్వితీ. 6:6, 7) (6)తల్లిదండ్రులు కుటుంబ అధ్యయనాన్ని ఆసక్తికరంగా ఎలా చేయవచ్చు? (7) తమ పిల్లలతో బైబిలు అధ్యయనం చేయడమే కాక, వారికి ఇంకా ఏమి ఇవ్వాలని దేవుని వాక్యం తల్లిదండ్రులను పురికొల్పుతుంది? (8) కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి బైబిలు సలహా ఎలా సహాయపడుతుంది? (9) ఆరోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఏయే లేఖన సూత్రాలను ఆచరణలో పెట్టడం సహాయకరంగా ఉంటుంది? (10) దేవుని వాక్యంలోని సూత్రాలు మీ సొంత జీవితంలో ఎలాంటి మార్పును తెచ్చాయి? (11) మీరు పరిచర్యలో కలిసిన ఎవరైనా ఈ వీడియోను చూస్తే, బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి ఎందుకు పురిగొల్పబడవచ్చు?