ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు ఏప్రిల్, మే నెలల్లో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. పునర్దర్శనాలు చేసినప్పుడు ఆసక్తిగలవారిని కనుగొంటే పత్రిక చందాలను ప్రతిపాదించవచ్చు. జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని లేదా నా బైబిలు కథల పుస్తకాన్ని ప్రతిపాదించండి. జూన్ నెలలో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? లేదా నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడంపై మనసు నిలపండి. జూలై నెలలో: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు. సముచితమైనచోట్ల, సర్వమానవాళి కొరకైన గ్రంథము, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూర్లను ప్రతిపాదించవచ్చు.
◼ సంఘ పైవిచారణకర్తల, కార్యదర్శుల అందరి చిరునామాలనూ టెలిఫోన్ నంబర్లనూ అప్‌టుడేట్‌గా సొసైటీ వ్రాసి పెట్టుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి చిరునామా గానీ టెలిఫోన్ నంబర్ గానీ మారినట్లయితే సంఘ పైవిచారణకర్త/కార్యదర్శి చిరునామా మార్పు పత్రం (S-29)ను కార్యదర్శి పూరించి సొసైటీకి వెంటనే పంపించాలి. ఎస్‌టిడి కోడ్ నంబర్లేవైనా మారితే వాటిని కూడా తెలపాలి.
◼ క్రమ పయినీరు సేవా దరఖాస్తు (S-205) ఫారాలూ, సహాయ పయినీరు సేవా దరఖాస్తు (S-205b) ఫారాలూ సంఘంలో కావలసినన్ని ఉండేలా సంఘకార్యదర్శులు చూసుకోవాలి. ఈ ఫారాలను సాహిత్యాలను కోరే పత్రం (S-14) ద్వారా ఆర్డర్ చేయవచ్చు. కనీసం ఒక సంవత్సరానికి సరిపడేన్ని ఉండేలా చూడండి. వచ్చిన క్రమ పయినీరు దరఖాస్తులన్నీ పూర్తిగా నింపబడ్డాయో లేదో రూఢిపర్చుకోవడానికి వాటిని పరిశీలించండి. దరఖాస్తుదారులకు తాము బాప్తిస్మం తీసుకున్న ఖచ్చితమైన తారీఖు గుర్తులేకపోతే, వాళ్ళు ఆ తారీఖును అంచనా వేసుకుని వ్రాసిపెట్టుకోవాలి.
◼ మీరు స్వంత పనులమీద విదేశాలకు వెళ్తున్నప్పుడు, ఆ దేశంలోని సంఘ కూటాలకుగానీ, ప్రాంతీయ సమావేశానికిగానీ, జిల్లా సమావేశానికిగానీ హాజరు కావాలనుకుంటే, వాటి తేదీలు, సమయాలు, చిరునామాలను గురించిన సమాచారం కోసం మీరు వెళ్ళే దేశాన్ని పర్యవేక్షించే బ్రాంచి కార్యాలయానికే వ్రాయాలి. బ్రాంచి కార్యాలయాల చిరునామాలు ఇప్పటి వార్షికపుస్తకములోని (ఆంగ్లం) చివరిపేజీలో ఉన్నాయి.
◼ సంఘాలు కోరిన ప్రచురణల్లో ప్రస్తుతం స్టాకులోలేనివి, ప్యాకింగ్ లిస్టులోని పెండింగ్ ఐటమ్స్‌లో సూచించబడతాయి. ఆ ప్రచురణలు స్టాకులోకి రాగానే వాటిని సంఘాలకు పంపిస్తారు. కాబట్టి, ఒకసారి ఏవైనా పెండింగ్ అయిటమ్స్‌లో కనబడితే వాటిని మళ్ళీ రిక్వెస్ట్ చేయగూడదు. అయితే, పెండింగ్ అయిటమ్స్‌లో ఉన్నటువంటి స్పెషల్ రిక్వెస్ట్ ఐటమ్స్ ఏవైనా ముందు ఆర్డరు చేసినవాటికన్నా ఎక్కువగా అవసరమైనప్పుడు, ఇదివరకే కోరిన ఈ ప్రచురణ పెండింగ్ అయిటమ్స్‌లో ఉందనీ, ఇప్పుడు అదనంగా కావాలనీ వివరిస్తూ ఒక చిన్న నోటు వ్రాసి సాహిత్యాలను కోరే పత్రం (S-14) తోపాటు ఒక చిన్న నోటు వ్రాసి పంపించాలి. అలా వివరించకుండా ఆర్డర్ చేసే ప్రచురణలు పంపించబడవు.
◼ ఒకే రాజ్య మందిరాన్ని ఉపయోగించే సంఘాలన్నీ తమకు కావలసిన సాహిత్యాలను తమ కోఆర్డినేటింగ్ సంఘం ద్వారా మాత్రమే పొందాలి.
◼ సంఘం కోసం సాహిత్యాలు లేదా పత్రికలను బట్వాడా చేయవల్సిన చిరునామాలో మార్పు వచ్చిందని మీరు సొసైటీకి తెలియజేసినప్పుడు, మీరిచ్చిన క్రొత్త చిరునామా అమలులోకి వచ్చేంతవరకు, పాత చిరునామాకు వచ్చే సరఫరాను సేకరించడానికి ఖచ్చితమైన ఏర్పాట్లను చేయాలి. చిరునామాలో వచ్చిన మార్పును టెలిఫోను ద్వారా లేదా ఫ్యాక్స్‌ద్వారా సొసైటీకి తెలిపినప్పటికీ ఈ ఏర్పాటు చేయాలి.
◼ దయచేసి, మళ్ళీ ప్రకటించేంత వరకు పరిశుద్ధ లేఖనాల నూతన లోక అనువాదము (ఆంగ్లం) డీలక్స్ ఎడిషన్లూ, ప్రాంతీయ భాషల్లోని బైబిళ్ళూ, కావలికోట, తేజరిల్లు! బౌండు వాల్యూమ్‌లూ, వీడియో క్యాసెట్లూ కావాలని ఆర్డర్లు పంపకండి. ప్రచారకులు ప్రాంతీయ భాషల్లోని బైబిళ్ళను స్థానిక విక్రయ స్థలాల్లోనే పొందాలని కోరుతున్నాము. దయచేసి పత్రికల స్వంత కాపీలను దాచుకొని వ్యక్తిగత గ్రంథాలయం కోసం, సంఘ గ్రంథాలయం కోసం సంవత్సరాంతంలో వాటిని బైండింగు చేయించుకోండి. సంఘ గ్రంథాలయాల్లో ఉంచిన వీడియో క్యాసెట్లను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.
◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
ప్రాథమిక బైబిలు బోధలు—పంజాబీ