బైబిలు—మానవజాతి అతి పురాతనమైన ఆధునిక గ్రంథము పట్ల మెప్పుదలను పెంపొందించడం
ఈ వీడియోను మీరు చూసినప్పుడు, ఈ క్రింది ప్రశ్నలు ఉన్నతపరిచే విషయాలను బహుశా మీరు గమనించి ఉంటారు: (1) ఏ వాస్తవాలు బైబిల్ని అసమానమైన గ్రంథంగా ప్రత్యేకపరుస్తున్నాయి? (2) బైబిలు అతి ప్రాచీన గ్రంథమైనప్పటికీ ఆధునిక విజ్ఞానశాస్త్రంతో ఎలా ఏకీభవిస్తుందో చూపించేందుకు మీరొక ఉదాహరణను ఇవ్వండి. (3) మూల రాత ప్రతులతో పోల్చిచూస్తే, నేడున్న బైబిలు మార్పు చెందలేదని మనమెలా నిశ్చయత కలిగి ఉండవచ్చు? (4) ప్రాచీన బైబిలు రాత ప్రతుల యొక్క విశిష్టమైన మూలపాఠ్య వైశిష్ట్యమేంటి, అది మీలో ఎలాంటి నమ్మకాన్ని పెంపొందిస్తుంది? (5) జాన్ విక్లిఫ్, యోహాన్నెస్ గుటెన్బర్గ్, విలియమ్ టిండేల్, మేరీ జోన్స్, చార్లెస్ టేజ్ రస్సల్లు దేవుని వాక్యం ప్రపంచమంతటా వ్యాపించటానికి ఏయే రీతుల్లో దోహదపడ్డారు? (6) చర్చి బైబిలును ఎంత క్రూరమైన రీతిలో వ్యతిరేకించింది, అయినా అది మన కాలం వరకూ తప్పించుకుని నిలవటానికి ఏమి సహాయం చేసింది? (7) యెహోవా సంస్థ ఎంత విస్తృతంగా బైబిళ్లను అనువదించి ముద్రించింది? (8) అనివార్య జూదం (1 తిమో. 6:9, 10), దంపతులు విడిపోవడం అలాగే వైవాహిక నమ్మక ద్రోహం (1 కొరిం. 13:4, 5; ఎఫె. 5:28-33), వస్తు సంపదను గురించిన తలంపులలో మునిగిపోవడం (మత్త. 16:26) వంటి సమస్యలతో వ్యవహరించేందుకు బైబిలిచ్చే ఆచరణాత్మకమైన సలహా ప్రజలకు ఎలా సహాయపడింది? (9) లేఖనాధార సూత్రాలను అన్వయించుకోవడం లోకంలో ఉన్న జాతి, వర్గ ద్వేషాలను అధిగమించేలా చేయగలదనడానికి ఏ రుజువులు ఉన్నాయి? (10) బైబిలులో ఉన్న విషయాలను తెలుసుకోవడం, ఏయే రీతుల్లో మీకు గొప్ప సంతోషాన్ని తెచ్చింది? (11) ఈ వీడియో నుంచి ఎవరు ప్రయోజనం పొందుతారని మీరనుకుంటున్నారు, మీరు వారికి దీన్నెలా చూపిస్తారు?