సేవా కూటాల పట్టిక
ఫిబ్రవరి 12తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ఫిబ్రవరి 26తో ప్రారంభమయ్యే వారంలో జరిగే సేవాకూటంలో బిలు—మానవజాతి అతి పురాతనమైన ఆధునిక గ్రంథము అనే వీడియో (ఆంగ్లం) చర్చించబడుతుంది. ఆ చర్చ మన రాజ్య పరిచర్య యొక్క ఈ పేజీలోనే ఉన్న ప్రశ్నల ఆధారంగా జరుగుతుంది.
15 నిమి: “సత్క్రియల ద్వారా యెహోవాను మహిమపరచండి.”a ప్రచారకులు పుస్తకంలో 187వ పేజీలో 2, 3 పేరాలలో ఉన్న వ్యాఖ్యానాలను చేర్చండి.
20 నిమి: “ఇతరులను ఎలా ఒప్పింపచేయాలి?” కావలికోట మే 15, 1998, 21-3 పేజీలలో ఉన్న ఆర్టికల్స్ ఆధారంగానూ, అలాగే ఎంపికచేయబడిన పాయింట్ల ఆధారంగానూ ఒక సంఘ పుస్తక అధ్యయన నిర్వాహకునికీ, ఒక పయినీరుకీ లేదా ఒక ప్రతిభావంతుడైన ప్రచారకునికీ మధ్య జరిగే చర్చ. 23వ పేజీలో ఉన్న “మీ విద్యార్థి హృదయాన్ని చేరడం” అన్న బాక్సును విశ్లేషించండి. స్థానిక టెరిటరీలో సర్వసాధారణమైన అబద్ధ నమ్మకాన్ని ఒకదాన్ని ఎంపికచేసుకున్న తర్వాత, ఆ విషయంపై బైబిలు చెబుతున్న దాన్ని అంగీకరించేలా ఒక వ్యక్తిని ఎలా ఒప్పించాలన్న విషయాన్ని చర్చిస్తారు.
పాట 8 (53), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 19తో ప్రారంభమయ్యే వారం
పాట 27 (221)
8 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్ట్.
15 నిమి: “దేవుని ఆశ్చర్య కార్యాలకు అవధానాన్ని ఇవ్వండి.”b యెషయా ప్రవచనం పట్ల మెప్పుదలను అధికంచేసే క్రొత్త పుస్తకంలోని కొన్ని ఉపమానాల్ని ప్రస్తావించండి.
22 నిమి: “యెహోవా నామాన్నీ, కార్యాల్నీ తెలియజేయండి.”c మార్చి, ఏప్రిల్ నెలల్లో పరిచర్యలో ఎక్కువగా పాల్గొనేందుకు స్థానికంగా చేయబడుతున్న ప్రత్యేక ప్రణాళికలను పెద్ద సమీక్షిస్తారు. సాధ్యమైనంత ఎక్కువమంది సహాయ పయినీరు సేవ చేసేలా ప్రోత్సహించడానికి చేసే ప్రయత్నాలను చేర్చండి. గత ఏప్రిల్ నెలలో పయినీరు సేవ చేసిన కొందరిని తాము అలా చేయడం మూలంగా పొందిన సంతృప్తిని తెలియజేయమనండి. అర్హతగల నిష్క్రియులైన ప్రతీ ప్రచారకుడూ సేవలో మనతో తిరిగి భాగంవహించేలా సహాయపడడంపైనా, అలాగే బాప్తిస్మం పొందని ప్రచారకులుగా అర్హులయ్యేలా పిల్లలకూ, ఇతర బైబిలు విద్యార్థులకూ సహాయపడడంపైనా దృష్టి కేంద్రీకరించండి.—మన రాజ్య పరిచర్య నవంబరు 2000 ప్రశ్నాభాగము చూడండి.
పాట 4 (43), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 26తో ప్రారంభమయ్యే వారం
పాట 22 (130)
8 నిమి: స్థానిక ప్రకటనలు. ఫిబ్రవరి కోసమైన క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వాలని ప్రచారకులకు గుర్తుచేయండి.
12 నిమి: జ్ఞానము పుస్తకం కోసం సూచిత అందింపులు. మార్చిలో జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించేందుకు మీ మనస్సులో ఒక అందింపు ఉందా? మన రాజ్య పరిచర్య గత సంచికల చివరి పేజీలను ఒక్కసారి మరలా చూస్తే, వాటిలో అనేక సంచికల్లో మొదటి సందర్శనం చేయడానికి అవసరమైన ఆలోచనలు ఉన్నాయి; వాటిలో చాలావాటికి పునర్దర్శనాల కోసం కూడా సలహాలను మీరు కనుగొంటారు. ఆ సూచిత అందింపుల్లో రెండు మూడింటిని పునఃసమీక్షించండి. (మార్చి, జూన్, నవంబరు 1996; జూన్ 1997; మార్చి 1998) మొదట్లోనే బైబిలు అధ్యయనాలను సూటిగా ప్రతిపాదించే పద్దతిని ఉపయోగించడం కోసం నవంబరు 1996 సంచికలో ఉన్న రెండు సూచిత అందింపులను ప్రదర్శించండి. క్రొత్త అధ్యయనాలను ప్రారంభించేందుకు ప్రత్యేక ప్రయత్నాన్ని చేయమని ప్రతీ ఒక్కర్నీ ప్రోత్సహించండి.
25 నిమి: “బిలు—మానవజాతి అతి పురాతనమైన ఆధునిక గ్రంథము” (ఆంగ్లం). ఈ పేజీలో ఉన్న ప్రశ్నలను ఉపయోగిస్తూ ప్రేక్షకులతో చర్చ. పది కోట్లకన్నా ఎక్కువ ప్రతులతో 37 భాషల్లో పూర్తిగాగానీ, పాక్షికంగాగానీ అందుబాటులో ఉన్న న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ విస్తృతంగా పంచిపెట్టబడిన బైబిళ్లలో ఒకటన్న వాస్తవాన్ని ఉన్నతపర్చండి. ఏప్రిల్‌లో ఈ పరంపరలో మూడవదైన బైబిలు—మీ జీవితంలో దాని శక్తి (ఆంగ్లం) అన్న వీడియోను మనం పునఃసమీక్షిస్తాం.
పాట 7 (51), ముగింపు ప్రార్థన.
మార్చి 5తో ప్రారంభమయ్యే వారం
పాట 26 (212)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
18 నిమి: “యెహోవా బలాన్నిస్తాడు.”d లేఖనాలు ఎలా అన్వయిస్తాయనేదానిపై ప్రేక్షకుల నుంచి వ్యాఖ్యానాల్ని రాబట్టండి.
22 నిమి: “విజయవంతమైన రీతిలో టెలిఫోను సాక్ష్యం ఇవ్వడం.”e సేవా పైవిచారణకర్త నిర్వహిస్తారు. కావలికోట డిసెంబరు 15, 1999, 23వ పేజీలో 17వ పేరానందు ఉన్న ప్రోత్సాహాన్ని చేర్చండి. మన రాజ్య పరిచర్య నవంబరు 2000లో ఉన్న “ఆన్సరింగ్ మెషీన్‌కు మీరు ఏమి చెబుతారు?” అన్న బాక్సును పునఃసమీక్షించండి. టెలిఫోన్ సాక్ష్యం కోసం ఏ యే టెరిటరీలు తయారు చేయబడ్డాయో వివరించండి. ఈ పనిలో స్థానికంగా సాధించిన సాఫల్యాన్ని తెలియజేసే కొన్ని సంక్షిప్త అనుభవాలను అడగండి.
పాట 5 (46), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a పరిచయ వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b పరిచయ వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c పరిచయ వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d పరిచయ వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
e పరిచయ వ్యాఖ్యానాలను ఒక నిమిషంకన్నా తక్కువకు పరిమితంచేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.