కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/01 పేజీలు 3-4
  • యెహోవా నామాన్నీ, కార్యాల్నీ తెలియజేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా నామాన్నీ, కార్యాల్నీ తెలియజేయండి
  • మన రాజ్య పరిచర్య—2001
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘దేవుని వాక్యమును సంపూర్ణముగా ప్రకటించండి’
    మన రాజ్య పరిచర్య—2002
  • ‘సువార్తనుగూర్చి సాక్ష్యమివ్వండి’
    మన రాజ్య పరిచర్య—2008
  • యెహోవా ఆశ్చర్యకార్యాల గురించి నిరంతరం తెలియజేస్తుండండి
    మన రాజ్య పరిచర్య—2004
  • యెహోవా గుణాతిశయములను ప్రచురం చేయండి
    మన రాజ్య పరిచర్య—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2001
km 2/01 పేజీలు 3-4

యెహోవా నామాన్నీ, కార్యాల్నీ తెలియజేయండి

1 “యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. . . . యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక.” (కీర్త. 105:1, 3) ఆ మాటల్ని కూర్చిన కీర్తనకర్త యెహోవాను గురించీ, ఆయన “కార్యములను” గురించీ ఇతరులకు చెప్పడంలో వ్యక్తిగత ఆనందాన్ని ఎంతగానో పొందాడు. ఏ కార్యాలు? అవి నిస్సందేహంగా దేవుని మహిమకరమైన రాజ్యాధిపత్యానికీ, “రక్షణసువార్త”కూ సంబంధించిన కార్యాలే.—కీర్త. 96:2, 3; 145:11, 12.

2 రెండువేల ఒకటవ సంవత్సర జ్ఞాపకార్థ కూటం జరిగే సమయం దగ్గరౌతుండగా, మనపట్ల యెహోవా చేసిన కార్యాల్ని గురించి ఆనందించేందుకు మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏ విధంగా? నిస్సంశయంగా నిజ క్రైస్తవులందరికీ సంవత్సరంలో అత్యంత గొప్ప ఆచరణ, ప్రభు రాత్రి భోజన ఆచరణే. ప్రాముఖ్యత, సంకల్పం, లేదా కార్యవిధానం వంటి వాటి విషయానికొస్తే అలాంటి సందర్భం మరొకటేదీ లేదు. మన రక్షణ కోసం మాధ్యమాన్ని అందించేందుకు యెహోవా యేసులు చేసిన దాన్ని మనమంతా జ్ఞాపకం చేసుకోవలసిన సమయమిది. జ్ఞాపకార్థ కాలంలో, ‘రక్షణ సువార్తను’ మనం తెలియజేస్తుండగా క్షేత్రసేవలో విస్తృతమైన క్రియాశీలతను చూడాలని మనం సహజంగానే ఎదురుచూస్తాం!

3 మీరు సహాయ పయినీరు సేవ చేస్తారా? గత ఏప్రిల్‌లో 3,287 మంది సహాయ పయినీర్లుగా నమోదు చేయబడ్డారు. ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ నెలలను పరిచర్యలో విస్తృతపర్చబడిన క్రియాశీలతగల ప్రత్యేక నెలలుగా చేయగలమా? మార్చిలో మనకు ఐదు శనివారాలు ఉన్నాయి, ఏప్రిల్‌లో ఐదు ఆదివారాలు ఉన్నాయి. శని ఆదివారాల్ని పూర్తి సేవా దినాలుగా చేసుకోవడానికి ప్లాన్‌ వేసుకోవడం ద్వారా, పూర్తికాల ఉద్యోగంలో ఉన్న అనేకమంది ప్రచారకులు సహాయ పయినీరు సేవ చేయడం తమకు అందుబాటులో ఉన్నట్టుగా కనుగొన్నారు. నెలకు నిర్దేశిత 50 గంటలను చేరుకునేందుకు, ఒక సహాయ పయినీరు సగటున వారానికి దాదాపు 12 గంటలు వెచ్చించడం అవసరమౌతుంది. 4వ పేజీలోని బాక్సులో ఉన్న సూచిత షెడ్యూల్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. ఆ షెడ్యూల్స్‌లో ఏదైనా ఒకటి మీ పరిస్థితులకు సరిపోతుందా? సరిపోకపోతే, మార్చి ఏప్రిల్‌ నెలల్లో సహాయ పయినీరు సేవ చేసేలా మీదైన ఒక సొంత షెడ్యూల్ని వాటి ఆధారంగా తయారుచేసుకోవచ్చు.

4 పెద్దలు, సేవలో విస్తృతపర్చబడిన క్రియాశీలత కోసం ఉత్సాహాన్ని పెంపొందించేందుకూ, మద్దతను ఇచ్చేందుకూ ఇప్పటి నుంచే ప్రారంభించాలి. గత సంవత్సరం, సహాయ పయినీరులుగా అందరు పెద్దలూ, పరిచర్య సేవకులూ సేవలో భాగం వహించిన ఒక సంఘంలో, 121 మంది ప్రచారకుల్లో 64 మంది ఏప్రిల్‌ నెలలో పయినీరు సేవ చేశారు! ఆ సంఘం మార్చి, ఏప్రిల్‌లలో బాప్తిస్మం పొందని 6గురు ప్రచారకులు రిపోర్టు చేయడాన్ని చూసి ఆనందించడం జరిగింది కూడా. బహిరంగ సాక్ష్యమిచ్చే పనిలో భాగం వహించేందుకు పిల్లలూ, క్రొత్తవారూ అర్హులైనట్లైతే వాళ్లు పెద్దలను సమీపించి అడగడానికి అంతకన్నా మించిన మంచి తరుణమేదీ లేదు.

5 అదనపు ప్రయత్నం ఆశీర్వాదాల్ని తెస్తుంది: ప్రత్యేకమైన లక్ష్యాల్ని పెట్టుకొని, అదనపు ప్రయత్నం చేసే సంఘాలు అనేక ఆశీర్వాదాలను అనుభవిస్తాయి. కొన్ని సంఘాలు సాక్ష్యమిచ్చే ప్రత్యామ్నాయ పద్ధతులపై శ్రద్ధ నిలుపుతూ లేక ఇండ్ల దగ్గరలేని వారితో, చేరుకోవడానికి వీలుకాని నివాసులతో మాట్లాడడానికున్న ఒక ప్రతిభావంత మాధ్యమైన టెలిఫోన్‌ సాక్ష్యం ఇవ్వడాన్ని ఉన్నతపరుస్తూ అంతగా పనిచేయని ఒక సేవా ప్రాంతాన్ని పూర్తిచేయాలన్న విషయానికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇవ్వవచ్చు.

6 సేవలో సాధ్యమైనంత మేరకు పాల్గొనకుండా అనారోగ్యంగానీ, వృద్ధాప్యంగానీ తప్పనిసరిగా ఆటంకమౌతుందా? అందరి విషయంలోనూ కాదు. ఉదాహరణకు, క్యాన్సర్‌తో బాధపడుతున్న 86 సంవత్సరాల వృద్ధ సహోదరి తన కాళ్లు వాచిపోయినప్పటికీ, గత ఏప్రిల్‌లో ఆమె సహాయ పయినీరు సేవ చేశారు. టెలిఫోన్‌ సాక్ష్యం ఆమె సేవలో పూర్తిగా భాగం వహించడాన్ని సుసాధ్యం చేసి, యెహోవాకు ఆమె చెల్లించే స్తుతులను అధికం చేసింది. అది ఆమెపైనా, ఆమె సహవసిస్తున్న సంఘంపైనా ప్రేరణాత్మకమైన ప్రభావాన్ని చూపించింది.

7 జ్ఞాపకార్థ కూటం కోసం బాగా సిద్ధపడండి: ఈ సంవత్సరం జ్ఞాపకార్థ దినం ఏప్రిల్‌ 8వ తారీఖున వస్తుంది. ఆ రోజు ఆదివారం గనుక, మరింత ఎక్కువ మంది హాజరవ్వడానికి వీలౌతుంది. (1) జ్ఞాపకార్థ కూటానికి మనం హాజరవ్వడం ద్వారా (2) ఆ కూటంలో మనతోపాటు హాజరవ్వడానికి ఇతరులను ఆహ్వానించడం ద్వారా మనం మన వంతు చేసినట్లైతే ఇంతకు ముందుకన్నా ఇప్పుడు మరింత ఎక్కువ మంది హాజరవ్వవచ్చు. మనం ఎవరిని ఆహ్వానించాలి?

8 సత్యమందు ఎంతో కొంత ఆసక్తి చూపించిన వ్యక్తుల పేర్ల కోసం, మీరు వారిని క్రమంగా పునర్దర్శించకపోయినా సరే, మీ వ్యక్తిగత క్షేత్ర సేవా రికార్డుల్ని ఒక్కసారి తిరగేసి చూడండి. జ్ఞాపకార్థ దినానికి రెండు మూడు రోజుల ముందు, జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రికతో వాళ్లందర్నీ సందర్శించే విషయంపై శ్రద్ధ నిలపండి. మీ పరిస్థితులు అనుమతించినట్లైతే, జ్ఞాపకార్థ కూటానికి హాజరయ్యేందుకు సుముఖత చూపించేవారికి రానూపోనూ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పండి.

9 కొన్ని సంఘాల్లో, జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రికలన్నీ ఉపయోగించబడడం లేదు. సంఘ సెక్రటరీలు, ఆహ్వాన పత్రికలన్నిటినీ పంచిపెట్టగలిగేలా అవి తగినంత ముందుగా లభ్యమయ్యేలా చూడాలి. జ్ఞాపకార్థ కూటం జరిగే సమయాన్నీ, స్థలాన్నీ ఆహ్వాన పత్రిక దిగువన మీరు టైపు చేయవచ్చు లేదా స్పష్టంగా వ్రాయవచ్చు. లేదా మీ జ్ఞాపకార్థ కూటం గనుక రాజ్యమందిరంలోనే జరుపుకోబోతున్నట్లైతే దాని చిరునామా ఉన్న హ్యాండ్‌బిల్‌ను ఆహ్వాన పత్రికతోపాటు అందజేయవచ్చు. అనేక సందర్భాల్లో జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రికల్ని గృహస్థునికి స్వయంగానే అందించాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

10 నిష్క్రియులను జ్ఞప్తికి తెచ్చుకోండి: ఒక బైబిలు విద్యార్థి తనను తాను యెహోవాకు సమర్పించుకొని, దాన్ని నీటి బాప్తిస్మం ద్వారా సూచించినప్పుడు అది ఆనందించడానికి ఒక కారణమౌతుంది. అయితే, ప్రతీ సంవత్సరం మనలో కొందరు మనతో సహవసించడాన్ని మానుకుంటున్నారు, వారు యెహోవా నామాన్ని గురించీ ఆయన కార్యాల్ని గురించీ ఇతరులకు చెప్పడం మానుకుంటున్నారు. వారిపట్ల శ్రద్ధ చూపించడానికి మనకు మంచి కారణమే ఉంది. నిష్క్రియులైన వారిలో ఎక్కువమంది సత్యాన్ని విడిచిపెట్టకపోయినప్పటికీ, వాళ్లు నిరుత్సాహాన్నిబట్టో, వ్యక్తిగత సమస్యల్ని బట్టో లేక జీవితంలోని ఇతర చింతలనుబట్టో ప్రకటించడం మానుకొని ఉండవచ్చు. (మత్త. 13:20-22) ఆధ్యాత్మికంగా బలహీనమైన స్థితిలో ఉన్న వారిని సాతాను విధానం మ్రింగివేయక ముందే వాళ్లు సంఘానికి తిరిగి రావటానికి వారికి సహాయం అవసరమౌతుంది. (1 పేతు. 5:8) ఈ జ్ఞాపకార్థ కాలంలో అర్హులైన నిష్క్రియులంతా మరలా సువార్త ప్రకటనా పనిలో పాల్గొనేలా సహాయపడేందుకు మనం ఒక ప్రత్యేక ప్రయత్నాన్ని చేద్దాం.

11 సంఘ పుస్తక అధ్యయన గుంపుల్లో నిష్క్రియులైనవారు ఎవరైనా ఉంటే దాని విషయమై ఆ యా పుస్తక అధ్యయన నిర్వాహకులను సంఘ సెక్రటరీ అప్రమత్తుల్ని చేయాలి. నిష్క్రియులైన వారందరికీ కాపరి సందర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేయడంలో సంఘ సేవా కమిటీ నడిపింపునిస్తుంది. నిష్క్రియుడైన వ్యక్తి ఒక వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుంచి ప్రయోజనం పొందుతాడని నిర్ధారించబడినట్లైతే, ఎవరు ఆయనతో బైబిలు అధ్యయనంచేస్తే బావుంటుందన్న విషయాన్ని గురించి సేవా కమిటీలోని ఇతర సభ్యులను సంప్రదించిన తర్వాత, సేవా పైవిచారణకర్త, ఆ ఏర్పాటు చేస్తాడు. దీర్ఘకాలంపాటు అధ్యయనాన్ని నిర్వహించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, ఆ అధ్యయనాన్ని నిర్వహించడానికి నియమించబడిన వ్యక్తి వెచ్చించిన సమయాన్నీ, పునర్దర్శనాల్నీ, బైబిలు అధ్యయనాన్నీ రిపోర్టు చేయవచ్చు.

12 గత ఏప్రిల్‌లో ఇంటింటి పరిచర్య చేస్తున్న ఒక సహోదరి, వీధిలో వెళ్తున్న ఒక యువకునికి పత్రికలను ఇచ్చింది. ఆయన తన భార్య నిష్క్రియురాలైన ఒక సాక్షి అని చెప్పారు. రాజ్యమందిరం ఎక్కడుందనీ, తననూ తన భార్యను చూడ్డానికి రమ్మనీ ఆ సహోదరిని ఆహ్వానించారు. ఫలితంగా, ఆ భార్యభర్తలిరువురూ తర్వాతి కూటానికి హాజరయ్యారు, బైబిలు అధ్యయనానికి అంగీకరించారు.

13 విస్తృతపర్చబడిన క్రియాశీలత కోసం సంసిద్ధంకండి! యెహోవా నామాన్నీ, కార్యాల్నీ తెలియజేయాలని ప్రకటించిన కీర్తనకర్త ఇంకా ఇలా అంటున్నాడు: “ఆయననుగూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి.” (కీర్త. 105:2, 3) పరిచర్యలో మన ప్రయత్నాల్ని అధికం చేసుకోవడం ద్వారా, దీన్ని మునుపెన్నటికన్నా మరింత గొప్ప జ్ఞాపకార్థ కాలంగా చేయడం ద్వారా యెహోవా గొప్ప నామం పట్లా, ఆయన ‘ఆశ్చర్య కార్యాల’ పట్లా మనకున్న శ్రద్ధను ప్రదర్శిద్దాం!

[4వ పేజీలోని బాక్సు]

సహాయ పయినీరు సేవ కోసం వారానికి 12 గంటలు షెడ్యూల్ని వేసుకునే వివిధ మార్గాలు

దినం గంటలు

సోమవారం 1 2 − −

మంగళవారం 1 − 3 −

బుధవారం 1 2 − 5

గురువారం 1 − 3 −

శుక్రవారం 1 2 − −

శనివారం 5 4 3 5

ఆదివారం 2 2 3 2

మొత్తం: 12 12 12 12

ఈ షెడ్యూళ్లలో ఏదైనా ఒకటి మీ పరిస్థితులకు సరిపోతుందా?

అలా కానట్టైతే, మీ సొంత షెడ్యూల్నొకదాన్ని మీరెందుకు వేసుకోకూడదు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి