అన్ని పనులను దేవుని మహిమ కొరకే చేయండి
1 మన ప్రియ సహోదర సహోదరీలతో సహవసించడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో! (1 కొరిం. 16:17, 18) కూటాల్లోను, సమావేశాల్లోను జిల్లా సమావేశాల్లోను పరిచర్యలోను మనం దీనిని చేస్తాము. మనింటికి అతిథులు రావడం వంటి అనియత సందర్భాల్లోను మనం సహవసిస్తాము. ఆ విధంగా చేయడం ద్వారా మనం ఆతిథ్యాన్ని కనబరచి, ఒకరినొకరం ప్రోత్సహించుకుంటున్నాం. (రోమా. 12:13; 1 పేతు. 4:9) వివాహ విందులకు ఏర్పాట్లు చేసేటప్పుడు కావలికోట ఏప్రిల్ 15, 1984 (ఆంగ్లం) లో ఇవ్వబడిన మంచి ఉపదేశాన్ని మనస్సులో పెట్టుకోవడం మంచిది. అన్ని పనులు దేవుని మహిమపరచే విధంగా ఉండేందుకు ఎంత మందిని పిలవాలి, గుంపును ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే విషయాలను తీర్మానించేందుకు ముఖ్యంగా 19 మరియు 20వ పేజీల్లో ఇవ్వబడిన సలహాను గమనించండి.
2 సంస్థీకరించబడిన సాంఘిక కార్యక్రమాలు: మనం “భోజనము చేసినను పానముచేసినను” మరేమి “చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయు”దము. (1 కొరిం. 10:31-33) తగిన రీతిగా పర్యవేక్షించలేనంత పెద్ద సాంఘిక కూటాల వల్ల కొందరు ఈ సలహాను పాటించ లేదు, మరి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, వందలాది మంది ప్రజలు పెద్ద ఫంక్షన్లకు ఆహ్వానించబడ్డారు. అక్కడ లౌకిక వినోదం కనిపించింది. ప్రవేశ రుసుములు మరియు ఇతర రుసుములు చెల్లించాలని కొన్నిసార్లు హాజరయ్యేవారు కోరబడతారు. అలాంటి కూటాలు మర్యాదకు, బైబిలు సూత్రాలకు భిన్నమైన స్ఫూర్తి గల లోక కార్యక్రమాలను పోలి ఉంటాయి.—రోమా 13:13, 14; ఎఫె. 5:15-20.
3 తగిన పర్యవేక్షణ లోపించిన మరియు హితకరం కాని, లోకరీతిగానున్న వినోదాన్ని చూపించే అద్దెకు తీసుకున్న వసతుల్లో అనేకమంది సాక్షులు సమకూడారని నివేదించబడుతుంది. అలాంటి అనేక కార్యక్రమాలు “యెహోవాసాక్షుల” వారాంతం అనే పేరట హోటళ్ళలోను లేదా వ్యాహేళి కేంద్రాల్లోను ప్రకటించబడ్డాయి. అలాంటి పెద్ద గుంపులను సరైన విధంగా పర్యవేక్షించడం చాలా కష్టమైనందువల్ల సమస్యలు వచ్చాయి. రౌడీతనం, మత్తు పానీయాలను అమితంగా త్రాగడం, అనైతిక క్రియలు కూడా కొన్నిసార్లు జరిగాయి. (ఎఫె. 5:3, 4) నిజంగా అలాంటి ప్రవర్తన ఉండే సామూహిక కూటాలు యెహోవాను ఘనపరచవు. బదులుగా అవి సంఘానికున్న మంచి పేరుపై నిందను తెస్తాయి, ఇతరులకు అభ్యంతరం కలిగిస్తాయి.—1 కొరిం. 10:23, 24, 29.
4 క్రైస్తవులు ఆతిథ్యం చూపించడానికి ప్రోత్సహించబడుతున్నారు, కాని ఆత్మీయకార్యాలను ఇచ్చిపుచ్చుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. (రోమా. 1:11, 12) సాధారణంగా గెట్-టుగెదర్లు (కలుసుకునే వారి గుంపు) చిన్నగా ఉండడమే మంచిది. మన పరిచర్య పుస్తకం 135-6 పేజీల్లో ఇలా చెబుతుంది: “కొన్నిసార్లు క్రైస్తవ సహవాసం కొరకు అనేక కుటుంబాలను ఆహ్వానించవచ్చును. . . . అట్టి సందర్భాలలో అక్కడ జరిగే వాటన్నిటికి బాధ్యత ఆహ్వానించిన వారిదేనని వారు భావించుట కారణసహితమే. దీనిని మనస్సునందుంచుకొని, వివేకులైన క్రైస్తవులు, పిలువబడినవారి సంఖ్యను, కాలపరిమితిని హద్దులోవుంచుకొనుట జ్ఞానయుక్తమని తలంతురు.” మన స్నేహితులను ఆత్మీయంగా ప్రోత్సహించడమే మన లక్ష్యమైనప్పుడు మిగుల శ్రమ చేయవలసిన అవసరం ఏమీ లేదని యేసు సూచించాడు.—లూకా 10:40-42.
5 తోటి క్రైస్తవులకు ఆతిథ్యం చూపించడం మంచి విషయమే. అయినప్పటికీ, మనింట్లోనే ఆడంబరాలు లేకుండా విందు చేసుకోవడానికి మరియు అద్దెకు తీసుకున్న వసతియందు లోక స్ఫూర్తిని ప్రతిబింబించే పెద్ద ఫంక్షన్కు ఎంతో వ్యత్యాసం ఉంది. ఇతరులను మీరు అతిథులుగా ఆహ్వానించేటప్పుడు, జరుగబోయే దానికి మీరు పూర్తి బాధ్యతను తీసుకోగలరని మీరు నిశ్చయపరచుకోవాలి. కావలికోట ఆగస్టు 15, 1992 (ఆంగ్లం) పేజీ 17-20 చదవండి.
6 నిజంగా, సత్క్రియల్లో కొనసాగేందుకు మనకు ప్రేరణనిచ్చే ఉత్తేజకరమైన ప్రోత్సాహాన్ని ఎక్కడ నుండి పొందుతున్నామో ఆ సహోదరత్వాన్ని యెహోవా మనకు అనుగ్రహిస్తున్నాడు. (మత్త. 5:16; 1 పేతు. 2:12) సాంఘిక కార్యక్రమాల్లో నమ్రతను మరియు సహేతుకతను ప్రదర్శించడం ద్వారా, మనం ఎల్లప్పుడూ మన దేవునికి మహిమను తెస్తూ ఇతరులను బలపరచేవారిగా ఉంటాం.—రోమా. 15:2.