1995 “ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశం
1 మనం ఆనందంగా ఉండేందుకు మనకెన్ని కారణాలున్నాయి? బహుశ మనలో చాలా తక్కువ మంది మాత్రమే వాటినన్నింటిని లెక్కించడానికి ప్రయత్నించి ఉండవచ్చు. సంక్షోభం, అనిశ్చయతలు గల లోకంలో జీవిస్తున్నప్పటికీ, ఆనందించడానికి మనకెన్నో కారణాలున్నాయి. ముందే ప్రకటించిన ప్రకారం, 1995 జిల్లా సమావేశాల కొరకైన “ఆనందమయ స్తుతికర్తలు” అనే అంశం ఎంతో ప్రోత్సాహకరమైనది.
2 యెహోవా మనకు సత్యాన్ని నేర్పినందుకు మనం ఆయనను స్తుతిస్తాము. (యెష. 54:13; యోహాను 8:32) దాని ఫలితంగా, భద్రత కొరకు, ఆనందం కొరకు వెదుకుతున్న వారితో మనం సత్యాన్ని సంతోషంగా పంచుకుంటాము. (యెహె. 9:4; అపొ. 20:35) మన క్రైస్తవ సహోదరత్వం కూడా మనకు ఆనందాన్ని తెస్తుంది. ఒక ప్రేమపూర్వకమైన ఆత్మీయ కుటుంబం సంతృప్తిని, సంతోషాన్ని తెస్తుంది. మనం యెహోవాను సేవించడానికి పురికొల్పే మన ఆనందానికి ఇవి కొన్ని కారణాలు మాత్రమే. సమావేశ ప్రసంగాలు మరియు ప్రదర్శనలు మన శ్రద్ధను ఈ క్లిష్టమైన అంత్యదినాల్లో ఆనందానికి అదనపు కారణాలైన వాటి వైపుకు మళ్ళిస్తాయి.
3 మూడు రోజుల సమావేశం: మూడు రోజుల సమావేశానికి హాజరయ్యేందుకు మీరు మీ పై అధికారితో సెలవుల కొరకు అభ్యర్థన చేసుకున్నారా? పాఠశాలకు వెళ్తున్న పిల్లల తలిదండ్రులు పాఠశాల జరుగుతున్న సమయంలో ఈ సమావేశాల్లో ఒకదానికి హాజరవుతున్నట్లయితే, వారి ఆరాధనలోని ఈ ముఖ్యమైన భాగానికి వెళ్ళేందుకు శుక్రవారం మరియు శనివారం పిల్లలు పాఠశాలకు హాజరు కారని ఉపాధ్యాయులకు వినయంగా తెలపాలి. మీకు సమీపంలో సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఫిబ్రవరి 15, 1995 కావలికోట ఇండియాలోని 16 సమావేశాల స్థలాలను పట్టికవేసింది. ఇప్పటికెల్లా, మీ సంఘ సెక్రటరీ మీ సంఘం కొరకైన వివరాలను మీకు తెలిపే ఉంటాడు. ఆంగ్లంలోనే కాక, కన్నడ, కొంకణి, గుజరాతి, తమిళం, తెలుగు, బెంగాలి, మరాఠి, మలయాళం మరియు హింది భాషల్లోను సమావేశాలు జరుగుతాయి.
4 చాలా ప్రాంతాల్లో, కార్యక్రమం శుక్రవారం ఉదయం 9:40కు మొదలై ఆదివారం మధ్యాహ్నం రమారమి 3:50 గంటలకు ముగుస్తుంది. శనివారం మరియు ఆదివారం ఉదయం 9:30 గంటలకు కార్యక్రమం మొదలౌతుంది. సాక్షులు మరియు ప్రజలు ఉదయం 8 గంటల నుండి ఆహ్వానించబడతారు, కాని ప్రత్యేక పని నియామకాలు గలవారు ముందే ప్రవేశించడానికి అనుమతించబడతారు.
5 మీరు హాజరై ఉంటారా?: సమావేశంలోని మూడు రోజులు హాజరు కావాలని మనం కోరబడుతున్నాము. అలా ఎందుకని? మనమక్కడ ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. నేడు మన విశ్వాసం మరియు ఆత్మీయ ఆరోగ్యం తీవ్రమైన ముట్టడిలో ఉన్నాయి. యూదా ప్రాంతంలోని క్రైస్తవులు గొప్ప ఒత్తిళ్ళను అనుభవిస్తున్న సమయంలో “సమాజముగా కూడుట మానక” ఉండడాన్ని గూర్చి పౌలు ఉపదేశించాడు. (హెబ్రీ. 3:12, 13; 10:25) ఫిలిప్పీయులు “మూర్ఖమైన వక్రజనము” మధ్యలో జీవించేవారు. అయినప్పటికీ, వారు ‘లోకమందు జ్యోతులవలె ప్రకాశించే’ వారు. (ఫిలి. 2:14-16) ఈ తొలి శతాబ్దపు క్రైస్తవులు ఎందుకు భిన్నంగా ఉన్నారు? ఎందుకంటే, ‘ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకోవడానికి’ వారు సమావేశమయ్యేందుకు వారిని నడిపించిన పరిశుద్ధాత్మ నడిపింపును వారు విధేయతతో అనుసరించారు.—హెబ్రీ. 10:24, 25.
6 లోక ప్రభావం మనల్ని మరో విధంగా ప్రభావితం చేస్తూ మన సహోదరులను కలుసుకొని యెహోవాను స్తుతించాలన్న మన కోరికను బలహీనపరచవచ్చు. కనుక, మనం యెహోవా ఆత్మకు లోబడాలని సమావేశంలోని మూడు రోజులు ఆనందించాలని ఆహ్వానించబడుతున్నాము. మన కుటుంబమంతా హాజరు కావాలని మనం తీర్మానించుకున్నామా? మన ప్రేమను, విశ్వాసాన్ని క్రమంగా బలపరచుకోవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో మనకు సహాయపడేందుకు యెహోవా వార్షిక సమావేశాలను దయచేశాడు.
7 నిధిని ఇంటికి తీసుకువెళ్ళండి: సమావేశం నుండి ప్రయోజనాన్ని ఎలా పొందగలరు? ఒక్కమాటలో జవాబు “ఏకాగ్రత.” అమితోద్రేకాన్ని చెందిన, వేగిరపాటులో ఉన్న నేటి సమాజంలో ఇది అంత సులభమైన పని కాదు. ఆరోగ్యవంతులైన యౌవనస్థులు ఏకాగ్రతను నిలపడం కష్టమని కనుగొంటారు, కాని జిల్లా సమావేశానికి హాజరైనప్పుడు మనమందరం ఎదుర్కొనే సమస్యే ఇది. మనం ముందుగా పథకం వేసుకున్నట్లయితే మనం ఏకాగ్రతను నిలుపుకోగలం. ‘సమావేశ అంశం ఏది? నేనెందుకు వెళ్తున్నాను, ఆ మూడు రోజుల్లో నేనేమి చేస్తాను? నా సాయంకాల సమయాలు వినోదాలతో గడిచిపోతాయా లేక విశ్రాంతి తీసుకునేలా మరియు సమావేశంలోని ఉన్నతాంశాలను పునఃసమీక్షించేలా కావలసినంత సమయాన్ని పట్టిక వేసుకున్నానా?’ అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దానిని ధ్యానించండి!
8 ఫిబ్రవరి 1, 1984 కావలికోట (ఆంగ్లం) “మీరు ధ్యానిస్తారా లేక పగటి కలలు కంటారా?” అనే శీర్షిక కూటం నుండి ఎలా ప్రయోజనాన్ని పొందవచ్చు అనే దానిపై అనేక సలహాలనిచ్చి, ఈ నిర్ధారణకు వచ్చింది: “మానసిక క్రమశిక్షణ బహుశ ఎంతో ప్రాముఖ్యమైన కారణం కావచ్చు.” ప్రసంగీకుడు ప్రసంగం ఆరంభించినప్పుడు సాధారణంగా మనం శ్రద్ధగా కూర్చుంటాము, కాని ప్రసంగం సగం అయ్యేసరికి మనస్సు “పట్టు వదలడానికి” మనం అనుమతిస్తాము. ఇలా జరగడాన్ని మనమెలా నివారించవచ్చు?
9 గతంలో ఇవ్వబడిన సలహాలు ఫలవంతమైనవి కనుక, అవి పునరుక్తి చేయదగినవి. సాధ్యమైతే, ప్రతి రాత్రి కావలసినంత విశ్రాంతి తీసుకోండి. ఇది అంత సులభం కాకపోవచ్చు, ఎందుకంటే, ప్రయాణం చేయవలసి ఉంటుంది మరియు ఒకవేళ మీరు హోటల్‌లో ఉన్నట్లయితే, మనం ఇంట్లో ఉన్నప్పటిలా త్వరగా నిద్రకుపక్రమించించలేక పోవచ్చు, లేక అంత హాయిగా నిద్రపోలేకపోవచ్చు. మంచి పథకం సాధారణంగా కావలసినంత విశ్రాంతి తీసుకోవడానికి అనుమతిస్తుంది.
10 సరళమైన నోట్సు వ్రాసుకోవడం ఏకాగ్రతను నిలుపుకోవడానికి ఒక సహాయకమని నిరూపించబడింది. మీరు మరీ ఎక్కువ సమాచారాన్ని వ్రాసుకుంటున్నట్లయితే, కొన్ని ముఖ్యమైన అంశాలను పూర్తిగా జారవిడుచుకోవచ్చు. బైబిలు విద్యార్థికి లేదా ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చినవారికి కార్యక్రమ సంగ్రహాన్ని అందించాలనే లక్ష్యంతో నోట్సు వ్రాసుకోవాలని సలహా. మీ మనస్సులో ఎవరైనా ప్రత్యేక వ్యక్తి లేకపోయినప్పటికీ, నోట్సు తీసుకోవడంలో మీకు లక్ష్యం ఉండవచ్చు. సమావేశమైన తరువాత, అవిశ్వాసులైన కుటుంబ సభ్యులతో అనియతంగా సాక్ష్యమిచ్చేటప్పుడు కార్యక్రమంలోని ఉన్నతాంశాలను అందించే సందర్భాలను మీరు కనుగొనవచ్చు. నోట్సు వ్రాసుకోవడం వలన మరియు విన్నదానిని పంచుకోవడం వలన సమాచారాన్ని మీరు వెంటనే మరచిపోరు. అలా చెప్పడం జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
11 తరచూ బహిరంగోపవ్యాస సహకారిత శబ్ద పరికారాలకు, మరిన్ని కుర్చీలకు అదనపు అద్దె, మొదలగునవి ఇమిడిన సమావేశ సౌకర్యాల అద్దె చాలా ఎక్కువ ఖర్చయినదే. ఈ ఖర్చులకు డబ్బు ఎక్కడనుండి వస్తుంది? డబ్బు రూపంలోని లేదా “వాచ్‌టవర్ సొసైటీ” పేరట చెక్కుల రూపంలోని మన స్వచ్ఛంద విరాళాల ద్వారా వస్తుంది. కీర్తన 96:8 మరియు 2 దినవృత్తాంతాలు 31:12 కు ఇది అనుగుణంగా ఉంది.
12 ఆనందమయ స్తుతికర్తలు దైవభక్తి గల ప్రవర్తనతో యెహోవాను ఘనపరుస్తారు: గత సంవత్సరం మన ప్రవర్తనను గూర్చిన ప్రోత్సాహకరమైన అనుకూల వ్యాఖ్యానాలు హోటల్ సిబ్బంది నుండి సమావేశ వసతులను కల్పించిన ఉద్యోగస్థుల నుండి వచ్చాయి. ఒక హోటల్ మేనేజర్ ఈ విధంగా చెప్పాడు: “సాక్షులు సహనం గలిగి సహకారాన్ని చూపించేవారును తమ పిల్లలపై శ్రద్ధ చూపేవారును కనుక వారికి వసతినివ్వడం ఎల్లప్పుడు సంతోషకరమైన విషయమే.” మరో హోటల్ డైరెక్టర్ చెప్పినదేమంటే ఇతర గుంపుల కన్నా సాక్షులు సంతోషంగాను, మరింత సంస్థీకరించబడిన వారిగాను కనిపిస్తారు. ఆ ప్రాంతంలో మన సమావేశమే అతి పెద్దదైనప్పటికీ, ఆయన ఇలా చెప్పాడు: “చిన్న గుంపులను పోల్చి చూస్తే మాకు వీరిని గూర్చిన ఫిర్యాదులు సమస్యలు తక్కువే ఉన్నాయి.”
13 మరొక హోటల్ ఉద్యోగస్థుడు చెప్పేదేమంటే, మనకంటే ముందు జరిగిన సమావేశంలో, హోటల్ సిబ్బంది అంతా హాజరున్నప్పటికీ, మరింత నష్టమూ అలాగే దొంగతనమూ జరిగాయి. కాని మన సమావేశాన్ని గూర్చి ఆయన ఇలా చెప్పాడు: “మనం సాక్షులను గూర్చి ఎక్కువ చింతించనవసరం లేదు. . . . వారు ఇక్కడ ఉన్నప్పుడు, ఒకరో ఇద్దరో మరమ్మత్తుచేసే వ్యక్తులను ఉంచితే సరిపోతుంది. అదైనా యంత్రోపకరణాలతో అకస్మాత్తుగా వచ్చే సమస్యలకు మరమ్మత్తు చేసేందుకే.”
14 అందే నివేదికలన్నీ అలాగే ఉంటే బాగుండునని ఆశిస్తాం కాని, నిజమది కాదన్నది విచారకరం. ఒక సమావేశ అధ్యక్షుడు ఈ విధంగా చెప్పాడు: “కార్యక్రమాలు ముగిసిన తరువాత, యౌవనారంభంలోని చాలా మంది పిల్లలు రాత్రి పూట [హోటల్] వరండాలో నవ్వుతూ, అరుస్తూ గుమికూడేవారు. ఇది మిగిలిన అతిథులకు అభ్యంతరం కలిగిస్తుంది, వారు విసుక్కుంటారు. కొందరు యౌవనస్థులు వరండాల్లోకి పరుగెత్తుకు వచ్చి, వేరే వాళ్ళ గదిలోకి వెళ్తూ టపీమని తలుపు వేయడం, గదుల్లో గట్టిగా అరవడం చేస్తారు.”
15 మరొక సమస్య ఏంటంటే, అనేక సంవత్సరాలుగా చాలా మంది సహోదరులు కార్యక్రమాలు జరుగుతుండగానే వరండాలో, హాలు బయటా మాట్లాడుతూ ఉండేవారు. గత సంవత్సరం, ఒక సమావేశంలో బైబిలు విద్యార్థి వ్రాసిన ఒక లేఖ చందాపెట్టెలో కనిపించింది. అదిలా ఉంది: “ప్రసంగాలు జరుగుతుండగా నడవలో చప్పుడుకు, పనులకు, మాటలకు, మర్యాదలేని ప్రవర్తనను చూసినప్పటంత నేనెన్నడూ విభ్రాంతి చెందలేదు, ఆశ్చర్యపోలేదు . . . నేనిప్పటికీ ఒక సాక్షిని కాను, దైవభక్తిని గౌరవాన్ని నేర్చుకుంటున్నవాడను.” నిజమే, మనలో ఎవరూ యెహోవా చేసిన ఏర్పాట్ల ఎడల మనకు మెప్పుదల లేదనే అభిప్రాయాన్ని ఏర్పరచాలని కోరుకోము.
16 అన్ని సమయాల్లోను మనల్ని మనమీ విధంగా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నేనెందుకు ఈ సమావేశానికి హాజరౌతున్నాను?’ మన ఆత్మీయత మరియు దైవిక భక్తి మన మాటల్లోను ప్రవర్తనలోను ఆత్మీయ ఏర్పాట్ల ఎడల మన మెప్పుదలలోను ప్రతిబింబించబడుతుంది. (యాకో. 3:13; 1 పేతు. 2:2, 3, 12) సంవత్సరాలుగా నిర్బంధాలను నిషేధాలను సహించిన సహోదరులు సమావేశాల్లో మరింత శ్రద్ధగలవారును మర్యాదగలవారును తమ సీట్లలోనే కూర్చునేవారును ప్రసంగాల్లోను ప్రదర్శనల్లోను లీనమయ్యేవారునై ఉంటారని తరచూ గమనించబడింది.
17 మీ వస్త్రధారణ మరియు కేశాలంకరణ మిమ్మల్ని గూర్చి తెలియజేస్తుంది: “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును” అని 1 సమూయేలు 16:7 నందు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అలా, ప్రజలు తరచూ మనమెలా కనిపిస్తున్నామనే దాని ఆధారంగా మనమెవరని చెబుతారు. ముఖ్యంగా ఆరాధన కొరకు మరియు క్రైస్తవ జీవితంలో ఉపదేశం కొరకు మనం సమావేశాలకు హాజరయ్యేటప్పుడు మన వస్త్రధారణ మరియు కేశాలంకరణ బాగా గమనించబడుతుంది. మీరు పాఠశాలకు వెళ్ళే యౌవనస్థులైతే, లేదా మీ లౌకిక ఉద్యోగం మిమ్మల్ని లౌకిక విధానాలను వెంబడించే ప్రజలతో సన్నిహిత సంబంధంలోకి తెస్తున్నట్లయితే, నమ్రతగల అలంకరణను గూర్చిన క్రైస్తవ ప్రమాణాలను మీరు వెంబడించడాన్ని అది ఒక సవాలుగా చేయవచ్చు.
18 వస్త్రధారణ మరియు కేశాలంకరణల ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా భిన్నంగా ఉంటాయి. క్రైస్తవులు తగిన, సరైన వస్త్రాలను ధరించాలని అపేక్షించబడుతున్నారు. దీనిని ఎవరు తీర్మానించాలి? యౌవనారంభంలోని తమ పిల్లలు పాఠశాలలోని లోకస్థుల పిల్లలవలె వస్త్రధారణ చేయడం లేదని తలిదండ్రులు నిశ్చయపరచుకోవాలి. ఈ సున్నితమైన విషయంలో సరైన తీర్మానాలను తీసుకోవడానికి మనకు సహాయం చేసే నిర్మాణాత్మకమైన మార్గనిర్దేశాలు ఇవ్వబడ్డాయి. ఫిబ్రవరి 8, 1987 తేజరిల్లు! (ఆంగ్లం)లోని “మీ వస్త్రధారణను గూర్చిన మీ అభిప్రాయమేమిటి?” అనే శీర్షికను పునఃసమీక్షించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. గత సంవత్సరం జరిగిన మన సమావేశాల్లో కొన్నింటిలో ఏమి గమనించబడింది?
19 “దైవిక భయం” జిల్లా సమావేశాల్లో ఒకటి ముగిసిన తరువాత, ఈ అభిప్రాయాన్ని అందుకున్నాం: “సహోదరసహోదరీలు ఈ సంవత్సరపు సమావేశంలో తమ వస్త్రధారణలోను, కేశాలంకరణలోను, ప్రవర్తనలోను మరింత అభివృద్ధిని సాధించారు. . . . అయినప్పటికీ, ఇంకా కొన్ని పరిస్థితులను అలవాట్లను మెరుగుపరచుకోవలసిన అవసరముంది.” మరొక సమావేశం తరువాత, తగని వస్త్రధారణ ఎక్కువగా కనిపించిందని నివేదించబడింది. కొందరి వస్త్రధారణ ఇతరులకు అసహ్యం కలిగించేదిగా ఉంది అని కూడా ఆ నివేదిక పేర్కొన్నది. హాజరైన కొందరు బయటివారు కూడా తగని వస్త్రధారణను గమనించారు. కొంతమంది వస్త్రాలు శరీరం కనిపించే విధంగాను, మరీ బిగువుగాను ఉన్నాయి.
20 చాలా మంది సహోదరసహోదరీలు సమావేశ స్థలంలో తగిన, మర్యాదగల వస్త్రాలను ధరిస్తారు. అయితే, తరువాత కూడా హోటల్‌లోను లేదా రెస్టారెంట్లలోను కొందరు సహోదర సహోదరీలు “దేవుని ప్రజల్లా కాక చేతులు లేని చొక్కాలను పాత ప్యాంట్లను నిక్కర్లను పిచ్చి ఫ్యాషన్‌లలోని దుస్తులను వేసుకొని” వాటిపై బ్యాడ్జులను అలాగే ఉంచుకుంటున్నారు. విశ్రాంతి తీసుకునే సమయంలో అలాంటి వస్త్రాలను వేసుకొనే అలవాటు గల వారిని సంఘ పెద్దలు గమనించినట్లయితే, ముఖ్యంగా క్రైస్తవ సమావేశాల ప్రతినిధులుగా అలాంటి అలంకరణ సముచితం కాదని సమావేశానికి ముందే దయాపూర్వకమైన అలాగే దృఢమైనదైన సలహాను ఇవ్వడం సముచితమైనదవుతుంది. సమావేశానికి హాజరయ్యే బైబిలు విద్యార్థులతో ప్రవర్తన మరియు వస్త్రధారణ విషయంలో పైన క్లుప్తీకరించబడిన మార్గనిర్దేశాలను పునఃసమీక్షించండి.
21 హోటళ్ళు: ప్రతి సంవత్సరం ఎవరిపైన అధిక ఆర్ధిక బరువును మోపకుండా ఉండేందుకు తక్కువ అద్దెలో వసతులను కల్పించే పెద్ద ప్రయత్నమే చేయబడుతుంది. హోటల్ ఉద్యోగస్థులతో వ్యవహరించేటప్పుడు సహనం, దయకలిగి ఉండాలని గుర్తుంచుకోండి. మనం ప్రయాణం చేసి అలసి పోవచ్చు, వసతి కోసం నిలబడేవారి క్యూ చాలా పెద్దది కావచ్చు, కాని మీ సహనం గమనించబడకుండా పోదు. సరైన వాడుక ప్రకారం టిప్పులివ్వవలసిన అవసరం ఉందని మనం తప్పక గమనించాలి.—జూన్ 22, 1986, తేజరిల్లు! (ఆంగ్లం).
22 కెమెరాలు మరియు రికార్డింగ్ ఉపకరణాలు: కెమెరాలు మరియు రికార్డింగ్ పరికరాల గురించి దయాపూర్వకమైన జ్ఞాపికలను ఇవ్వడం సరైనది. మీరు కెమెరాలను వీడియో కెమెరాలను లేదా మరే రకమైన రికార్డింగ్ పరికరాలనైనా ఉపయోగించాలని అనుకుంటున్నట్లయితే చుట్టూ ఉన్నవారిని పరిగణించాలని దయచేసి గుర్తుంచుకోండి. కార్యక్రమాలు జరుగుతుండగా అటు ఇటు తిరగడం లేదా మీ సీట్లో కూర్చుని రికార్డు చేయడం కూడా ఇతరులకు ఆటంకం కలిగించవచ్చు. ఏ రకమైన రికార్డింగ్ ఉపకరణాలను ఎలక్ట్రికల్ లేదా సౌండ్ సిస్టెమ్‌లతో కనెక్ట్ చేయకూడదు, పరికరాలను నడవలో లేదా కాలిబాటలో అడ్డంగా పెట్టకూడదు. ఫోటోలను తీసుకోవాలి లేదా వీడియో కెమెరా లేదా ఆడియో కేసెట్టు రికార్డుతో కార్యక్రమ భాగాలను రికార్డు చేయాలని మీరు తీర్మానించుకోవడం వ్యక్తిగత విషయం. ఫోటోలను, రికార్డింగ్‌లను తరువాత చూసినప్పుడు ఆ మధుర స్మృతులు తిరిగి వస్తాయి. అలాంటి ఉపకరణాలన్నింటిని ఇతరులకు ఆటంకం కలిగించని విధంగా, లేదా మీరు కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనం పొందడాన్ని ఆటంకపరచని విధంగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీరు ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత, రికార్డింగ్‌లను పునఃసమీక్షించేందుకు సమయముంటుందా? నోట్స్ వ్రాసుకుంటే సరిపోతుందని మీరు కనుగొనవచ్చు.
23 సీట్లు: మరి 1994 “దైవ భయం” జిల్లా సమావేశం వద్ద, సీట్లు పెట్టడంలో మెరుగుపడడాన్ని గమనించారా? కొంత అభివృద్ధి సాధించబడింది, అయినప్పటికీ, ఈ జ్ఞాపికను గుర్తుంచుకోవలసిన అవసరం మీకుంది: మీ కుటుంబంలోని వారికి, మీ గుంపులో మీతో పాటు ప్రయాణం చేసేవారికి మాత్రమే సీట్లను ఉంచాలి. అక్కడ మనం సొసైటీ అతిథులం. ఆడిటోరియమ్ అద్దె స్వచ్ఛంద విరాళాల ద్వారా చెల్లించబడుతుంది. కూర్చుంటారనే నమ్మకం లేకుండా సీట్లు పెట్టడం ప్రేమపూర్వకమైన మరియు పరిగణనగల పనై ఉంటుందా? అలెర్జీ వంటి వాతావరణ సమస్యలున్న వారి కొరకు ప్రత్యేక స్థలాలు లేదా గదుల కొరకు రిక్వెస్ట్‌లు తీసుకోవడం మాకు సాధ్యం కానందుకు మేము చింతిస్తున్నాము.
24 వృద్ధులు, శారీరకంగా మంచి ఆరోగ్యం లేనివారు వంటి ప్రత్యేక అవసరాలున్న వారి కొరకు అనేక సమావేశాలు సీట్లను కేటాయిస్తున్నారు. మీరు అందుకు యోగ్యులు కానట్లయితే, ఆ భాగంలోని సీట్లలో కూర్చోవడం లేదని నిశ్చయపరచుకోండి. అలాగే, సీటును వెతుక్కునేందుకు ప్రత్యేక అవసరమున్నవారు తమను చూసుకొనే బాధ్యతగలవారు వారి వెంట లేకుండానే వచ్చినట్లయితే, వారికి సహాయమిచ్చేందుకు అప్రమత్తంగా ఉండండి.
25 మీ సమావేశ భోజన అవసరాలను చూసుకోవడం: మీకు తెలిసినట్లు, జూన్ 1995 మన రాజ్య పరిచర్య ఈ విధంగా ప్రకటించింది: “ఇక మీదట, జిల్లా సమావేశాల్లోను ప్రాంతీయ సమావేశాల్లోను మరియు ప్రత్యేక సమావేశ దినాల్లోను స్వల్పాహారం మాత్రమే లభ్యమౌతుంది. తమంతట తాముగా వడ్డించుకునే (కఫ్టిరియా) తరహా భోజనం లభ్యం కాదు. హాజరయ్యేవారు ఇష్టపడేటట్లయితే, లభ్యమవుతున్న వాటితో పాటు తినడానికి తాము స్వంతంగా ఆహారాన్ని తెచ్చుకోవచ్చు.” తర్వాత జూలై 1995 మన రాజ్య పరిచర్య అనుబంధం ఈ సవరణ ఎందుకు చేయబడిందో వివరించి, ప్రతి ఒక్కరు తినడానికి అవసరమైన వాటిని ఎలా తెచ్చుకోవాలో అనే విషయంపై కూడా మంచి సలహాలను ఇచ్చింది. ఆ అనుబంధాన్ని తాము మాత్రమే పునఃసమీక్షించడమే కాక, సమావేశానికి హాజరు కావడానికి సిద్ధపడుతున్న బైబిలు విద్యార్థులతో కూడా చర్చిస్తే బాగుంటుంది. సమావేశానికి హాజరయ్యే అందరూ ఫలహార డిపార్ట్‌మెంట్‌లో ఇచ్చేది కాకుండా ఇంకా కావాలనుకునే వారు ఆహార పదార్థాలను స్వయంగా తెచ్చుకోగలరని బైబిలు విద్యార్థులకు తెలపడం చాలా ప్రాముఖ్యం.
26 మీ మధ్యాహ్న భోజనంకొరకు ఇక్కడ సలహా ఇవ్వబడిన ఆహార పదార్థాలను మీరు తెచ్చుకొనేందుకు జ్ఞాపకముంచుకోవడానికి కేవలం కొన్ని విషయాలు పునరుద్ఘాటించడమైంది: చల్లని సాండ్‌విచ్‌లు, చపాతీలు, వేపుడుకూరలు, బిస్కట్లు, బేక్ చేసిన పదార్థాలు వంటి లౌకిక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళే పోషకాహారాలు, పండ్లు వంటి తేలికైన, మామూలు ఆహార పదార్థాలు. సమావేశ స్థలాల్లో లభ్యమయ్యే పానీయాల్లో టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్, పండ్ల రసం వంటివి దొరుకుతాయి. పగిలిపోని చిన్న నీళ్ళ సీసాలను మీరు స్వయంగా తెచ్చుకోవాలనుకుంటే, అవి కుర్చీ క్రింద పెట్టడానికి సాధ్యమైనవైతే అది సమ్మతమే. అయినప్పటికీ, పెద్ద కుటుంబాలు తీసుకువెళ్ళేంత పెద్ద నీళ్ళ క్యాన్లను, మత్తు పానీయాలు లేదా గాజు పాత్రలను సమావేశ స్థలానికి తీసుకురాకూడదు. కార్యక్రమ భాగాలు జరుగుతుండగా తినకూడదు, అల్పాహారాన్ని తీసుకోకూడదు. ఇది అందించబడుతున్న ఆత్మీయ భోజనం ఎడల అగౌరవాన్ని కనబరుస్తుంది.
27 అదనంగా తీసుకోవలసిన మరో జాగ్రత్త ఏమిటంటే, వంట చేయడానికి హోటల్ అధికారులు అనుమతించకపోతే, ఆ ఉద్దేశం కొరకు ఏర్పాట్లు చేయనట్లయితే హోటల్ గదుల్లో వంట చేయకూడదు. మధ్యాహ్న విరామ సమయం అల్పాహారాన్ని భుజించి, సహోదర సహోదరీలతో దైవ పరిపాలనా సహవాసాన్ని ఆనందించేందుకేనన్న వాస్తవాన్ని గంభీరంగా తలంచడం మంచిది. యెహోవా ప్రజలుగా సమావేశంలో ఆత్మీయ ఆహారం భౌతిక వస్తువులకన్నా ముఖ్యమైనదని మనం గుర్తించాలి, దాని ప్రకారం మనం పథకం వేసుకోవాలి.
28 ఇండియాలో “ఆనందమయ స్తుతికర్తలు” సమావేశంలో మొదటిది అక్టోబరు 20, 1995న మొదలౌతుంది. మీరు మీ సిద్ధపాట్లను ముగించి, మూడు రోజులు ఆనందమయమైన సహవాసాన్ని మరియు ఆత్మీయమైన మంచి విషయాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? మనం యెహోవా యొక్క ఆనందమయ స్తుతికర్తలుగా ఎలా ఉండాలో తెలుసుకుంటుండగా మీ సహోదర సహోదరీలతో ఈ వేసవి సమావేశానికి హాజరవ్వాలన్న మీ ప్రయత్నాన్ని యెహోవా ఆశీర్వదించాలని మా యథార్థ ప్రార్థన.
[6వ పేజీలోని బాక్సు]
జిల్లా సమావేశ జ్ఞాపికలు
బాప్తిస్మం: బాప్తిస్మ అభ్యర్థులు శనివారం కార్యక్రమం ఆరంభం కాకముందే, వారికి కేటాయించబడిన విభాగంలోని సీట్లలో కూర్చోవాలి. తగిన స్నాన వస్త్రాలను టవల్‌ను బాప్తిస్మం పొందాలనుకునే ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలి. బాప్తిస్మ ప్రసంగం, ప్రార్థన తర్వాత, ఆ కార్యక్రమ అధ్యక్షుడు అభ్యర్థులకు క్లుప్త మార్గనిర్దేశాలను ఇచ్చి, పాట పాడడానికి ఆహ్వానిస్తాడు. చివరి చరణం ముగిసిన తరువాత, అటెండెంట్లు అభ్యర్థులను బాప్తిస్మమిచే స్థలానికి తీసుకువెళ్తారు. ఒకరి సమర్పణకు ప్రతీకమైన బాప్తిస్మం ఒక్కో వ్యక్తికి మరియు యెహోవాకు మధ్య గల సన్నిహిత మరియు వ్యక్తిగత విషయం గనుక, బాప్తిస్మ సమయంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కౌగిలించుకొని లేదా చేతులు పట్టుకుని తీసుకునే సహవాసుల బాప్తిస్మమనే దానికి తావులేదు.
బ్యాడ్జ్ కార్డులు: దయచేసి, సమావేశంలోను సమావేశ స్థలానికి వెళ్ళేటప్పుడు, అక్కడి నుండి వచ్చేటప్పుడు 1995 బ్యాడ్జ్ కార్డును ధరించండి. మనం ప్రయాణం చేసేటప్పుడు మంచి సాక్ష్యమివ్వడాన్ని ఇది తరచూ సాధ్యపరుస్తుంది. బ్యాడ్జుకార్డులు మరియు వాటి కవరులు సమావేశంలో లభ్యం కావు కనుక, వాటిని మీ సంఘం నుండే పొందాలి. మీ క్రొత్త అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డును తీసుకువెళ్ళాలని గుర్తుంచుకోండి. బేతేలు కుటుంబ సభ్యులు మరియు పయినీర్లు తమ గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి.
వసతి: మీకు హోటల్‌లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే, ఆ విషయాన్ని రూమింగ్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షకుని శ్రద్ధకు తీసుకురావడానికి వెనుకంజవేయకండి, అలా ఆయన ఆ సమస్యను సరైన విధంగా పరిష్కరించడానికి మీకు సహాయపడగలడు. రూమ్ రిక్వెస్ట్ ఫారమ్‌లను సరైన సమావేశ చిరునామాలకు వెంటనే పంపాలని సంఘ సెక్రటరీలు నిశ్చయత కలిగి ఉండాలి. మీరు బుక్ చేసుకున్న ఏదైనా వసతిని రద్దు చేసుకోవాలనుకుంటే మీరు వెంటనే హోటల్ మరియు సమావేశ రూమింగ్ డిపార్ట్‌మెంట్‌కు తప్పక తెలపండి, అలా ఆ గదిని మరెవరి కన్నా ఇవ్వవచ్చు.
స్వచ్ఛంద సేవ: సమావేశంలో ఈ డిపార్ట్‌మెంట్లలో ఒకదానికి సహాయపడేందుకు మీరు సమయాన్ని పట్టిక వేసుకున్నారా? కొన్ని గంటలే అయినా మన సహోదరులను సేవించడం ఎంతో సహాయకరంగా ఉండగలదు, మరింత సంతృప్తిని తేగలదు. మీరు తోడ్పడగలిగినట్లయితే, దయచేసి సమావేశంలోని స్వచ్ఛంద సేవా శాఖకు తెలియజేయండి. పదహారేండ్లకన్నా తక్కువ వయస్సులోని పిల్లలు కూడా తలిదండ్రుల నిర్దేశం క్రింద లేదా మరొక బాధ్యత గల పెద్దవారి క్రింద పనిచేయడం ద్వారా మంచి తోడ్పాటునివ్వవచ్చు.
హెచ్చరిక మాటలు: పెద్ద సమస్యలను గూర్చి అప్రమత్తంగా ఉండడం ద్వారా, అనవసర సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. తరచూ దొంగలు మరితర అన్యాయానికి వెనుదీయని వ్యక్తులు తమ ఇంటి వాతావరణం నుండి దూరంగా నున్న ప్రజలను కొల్లగొడతారు. దొంగలు మరియు జేబుదొంగలు పెద్ద సమావేశాల్లో మరింత దోచుకోగలరని కనుగొంటారు. విలువైన వేటినైనా మీ సీట్లో ఉంచడం జ్ఞానయుక్తంగా ఉండదు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడేనని మీకు హామీ లేదు. ఏ రకమైన ప్రలోభాన్నైనా పెట్టడం ఎందుకు? కొందరు బయటి వ్యక్తులు పిల్లలను వంచించి తీసుకుపోవడానికి ప్రయత్నించినట్లు నివేదికలు అందాయి. అన్ని సమయాల్లోను పిల్లలను మీ దగ్గరే ఉంచుకోండి.
చాలా హోటళ్ళలో అందుబాటులో ఉన్న కేబుల్ దూరదర్శినులు కామాతురమైన, అశ్లీలమైన చిత్రాలను చూపిస్తాయి. ఈ ఉరిని గురించి అప్రమత్తంగా ఉండి, గదిలో పర్యవేక్షణ లేకుండా దూరదర్శినిని చూసేందుకు పిల్లలను అనుమతించకండి.
సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సమావేశ ఆడిటోరియమ్ మేనేజ్‌మెంట్‌కు దయచేసి ఫోను చేయకండి. పెద్దల నుండి సమాచారం లభించకపోతే, దయచేసి, సమావేశ చిరునామాకు వ్రాయండి.